మనిషి హుందాగా బతకాలంటే లక్ష దారులు ఉంటాయి…


“కూటి కోసం కోటి విద్యలు”
తెలుగు భాషలో పేరొందిన సామెత ఇది… మనిషి హుందాగా బతకాలంటే లక్ష దారులు ఉంటాయి… కాకపోతే సరైనటువంటి ట్రాక్ ను ఎంచుకోవడమే
అతని జీవితాన్ని నిర్దేశిస్తుంది…
ఈరోజు ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్నారు… గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అతను ఖాళీగా ఉంటున్నాడు అంటే నిరుద్యోగిత జాబితాలోనే అతన్ని లెక్కిస్తారు…. అయితే మెజారిటీ యువకుల ఆలోచన ఇప్పటికీ మేం డిగ్రీ కంప్లీట్ చేశాం ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ లలో ఏదో ఒక జాబ్ వస్తుందా…!! రాదా…! అని ఏండ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు.. కానీ ఇది సరైనది కాదు ఎందుకంటే ఒక సంవత్సరానికి లక్షల సంఖ్యలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే,, అంతే స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలను ఏ ప్రభుత్వం కూడా భర్తీ చేయలేదు…
దీనికి పరిష్కారం ముఖ్యంగా యువత స్వయం ఉపాధి రంగాల పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా వృత్తి ఆధారిత జీవనోపాధి కూడా నిరుద్యోగితను తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ మంత్రి నిరంజన్ రెడ్డి గారు టిఫిన్ చేస్తున్న మొబైల్ టిఫిన్ సెంటర్ దగ్గర యువకులను చూడండి…. నిరుద్యోగిత ను తగ్గించే పరిష్కారానికి వీళ్ళు అనుసరించిన దారే సరైన మార్గం…. తమకు ఉద్యోగం రాలేదు అని బెంగా లేకుండా అందరూ కలిసి ఒక జట్టుగా ఏర్పడి మొబైల్ టిఫిన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుని సరైన జీవనోపాధి పొందుతున్నారు…
ఇలాంటి యువకులను అభినందించి ప్రోత్సహించడం ద్వారా వారిని మరి కొంతమంది అనుసరించి ఆయా స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు స్వయంగా మొబైల్ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి వారిని అభినందించి వారి చేతి నుంచి తయారు కాబడ్డ టిఫిన్ ను ఆరగించడం జరిగింది.

About The Author