బిచ్చగాడి మృతి.. డబ్బు లెక్కించడానికి 8 గంట

వీధుల్లో భిక్షాటన చేసే వ్యక్తి దగ్గర లక్షల రూపాయల సొమ్ము బయటపడింది. ఏదో సినిమాల్లో కథలా ఉన్నా ఇది మాత్రం నిజ జీవితంలోనే జరిగింది. అతని వద్ద ఉన్న చిల్లరతోపాటు, బ్యాంకు బ్యాలెన్స్ అంతా లెక్కవేయగా రూ. 10 లక్షలు ఉన్నట్టు వెల్లడైంది. ఇది చూసిన పోలీసులే నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో పాటు అతని వద్ద పాన్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు కూడా లభ్యం అయ్యాయి.  

బిర్భిచంద్ ఆజాద్(62) అనే వృద్ధుడు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తుంటాడు. అతడు శుక్రవారం రాత్రి రైలు పట్టాలను దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతని వద్ద పరిశీలించగా చిల్లరడబ్బుతో పాటు బ్యాంకు పాసుబుక్కులు లభ్యం అయ్యాయి. చిల్లర అంతా 8 గంటల పాటు సమయం కేటాయించి లెక్కించగా అది రూ. 1.77 లక్షలుగా తేలింది. దీనితో పాటు వేర్వేరు బ్యాంకుల్లో జమ చేసిన  ఫిక్డ్స్‌ డిపాజిట్ మొత్తం విలువ 8 లక్షల 77వేల రూపాయలుగా గుర్తించారు. అతని కుటుంబ సభ్యులు ఎవరో తెలుసుకొని ఆ డబ్బు వారికి అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.

 

About The Author