ఉల్లిపాయ పొట్టే కదా అని పడేయకండి.. ఎందుకంటే..

ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు. ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. దీనిని తిననవసరంలేదు. కానీ మన పక్కన ఉంచుకుంటే వైరస్, బాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయంచేస్తుంది. అయితే ఉల్లి ఎంత మేలు చేస్తుందో దాని పొట్టు కూడా అంతే మేలు చేస్తుంది. సాధారణంగా ప్రతి రోజు ఉల్లిని వాడుతుంటాం. అయితే చాలా మంది ఉల్లిపాయ పొట్టే కదా అని పాడేస్తారు. కానీ అలా పడేయకండి. ఉల్లి తొక్కతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లి పొట్టుని గనుక సరైన రీతిలో వాడితే అటు ఆరోగ్యం, ఇటు అందం ఏకకాలంలో రెండూ పొందవచ్చు. మరి అది ఎలాగో ఓ లుక్కేస్తే పోలా..

ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది.

బరవు తగ్గాలనుకునే వారికి ఇది బాగా పని చేస్తుంది.

గిన్నెలో నీళ్ళు తీసుకుని, అందులో ఉల్లి పొట్టుని వేసి గుమ్మాల వద్ద, దోమలు వచ్చే ప్రదేశాలైన కిటికీల వద్ద ఆ పాత్రను ఉంచితే ఈగలు, దోమలు దరి చేరకుండా చేస్తుంది.

-తలస్నానం చేసే ముందు జుట్టుకు ఉల్లిపాయ పొట్టుతో బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వెంట్రుకలు రాలడం తగ్గి.. జుట్టు దృఢంగా పెరుగుతుంది.

 ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ పొట్టు తీసేసి ఆ నీటిని మన బాడీపై రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

 క్యాన్సర్ కణతుల వృద్ధిని తగ్గించే గుణం ఉల్లిపాయ పొట్టు సూప్‌లో ఉంది. అలాగే ఉల్లిపాయ సూప్ తాగడం వల్ల గుండె సమస్యలు కూడా రాకుండా

About The Author