తిరుపతి రైల్వే స్టేషన్ కు.. ప్రత్యామ్నాయంగా చంద్రగిరి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని వినతి

తిరుపతి చిత్తూరు జిల్లా:శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తుల రద్దీకి తిరుపతి రైల్వే స్టేషన్ కు ప్రత్యామ్నాయంగా చంద్రగిరి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని రైల్వే ఛైర్మెన్ వినోద్ కుమార్ యాదవ్ ను ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. బుధవారం తిరుపతి ఇస్కాన్ రోడ్ లోని రైల్వే అతిథి గృహంలో రైల్వే ఛైర్మెన్ ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరి కి చారిత్రాత్మక గుర్తింపు ఉందని, శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ నుంచి పాలన సాగించారని గుర్తుచేశారు. ఇటువంటి ప్రదేశాన్ని రైల్వే పరంగా అభివృద్ధి చేయాలని విన్నవించారు. తిరుపతి ట్రాఫిక్ నియంత్రణకు చంద్రగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఆవస్యకమని సూచించారు. 

 

 

 

 

 

 

 

About The Author