తిరుమల నుంచి ఎర్ర చందనం అక్రమ రవాణా అలిపిరి వద్ద వాహనం తో పాటు 13 దుంగలు

తిరుమల:బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు తమిళ స్మగ్లర్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. తిరుమల నుంచి ఎర్ర చందనం దుంగలు రవాణా చేసేందుకు ప్రయత్నించగా టాస్క్ ఫోర్స్ పోలీసు లు అలిపిరి వద్ద పక్కా సమాచారం తో పట్టుకున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, ఇతరటీమ్ లు శేషాచలం పరిసరాల్లో తనిఖీలు చేపడుతున్నారు.  ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ అల్లా బక్ష్ సూచనల తో ఆ ఎస్ ఐ వాసు, డీఆర్ ఒ పివి నరసింహారావు టీమ్ తిరుమల నుంచి వచ్చే వాహనాలపై దృష్టి పెట్టారు. టాస్క్ ఫోర్స్ కు పక్కా సమాచారం అందడంతో బుధవారం రాత్రి నుంచి మొదటి ఘాట్ రోడ్డులో అలిపిరికి ముందు కాపు కాశారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఒక టాటా సఫారీ వాహనం, పూజలు చేసుకుని వస్తున్నట్లు , వాహనం ముందు భాగాన పూలతో అలంకరించి వస్తూ కనిపించింది. టాస్క్ ఫోర్స్ టీం  ఆ వాహనాన్ని ఆడుకున్నారు

వాహనం తో పాటు 13 దుంగలు స్వాధీనం. ఇటీవల ఇదే వాహనంలో తిరుమల కు 5 సార్లు వచ్చి ఎర్ర చందనం రవాణా

        

 

About The Author