తిరుపతి కి చెందిన ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

తిరుపతి: ‌నగరానికి చెందిన కొంతమంది శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ బుధవారం పట్టుబడ్డారు. తిరుపతి ఐఎస్ మహల్ పరిసర ప్రాంతాలకు చెందిన వీరిలో ఇద్దరు పట్టుబడగా మరో ముగ్గురు తప్పించు కున్నారు. వీరి నుంచి రవాణా చేయడానికి సిద్దంగా ఉన్న 12 ఎర్ర చందనం దుంగలతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ లు అల్లా బక్ష్, వెంకటయ్య సూచనల తో ఆర్ ఎస్ ఐ వాసు, డీఅర్ ఒ పివి నరసింహారావు ల టీమ్ కల్యాణి డామ్ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. వీరికి కొందరు స్థానికులు అడవిలోకి వెళ్లినట్లు సమాచారం తెలిసింది. ఈ విషయాన్ని ఆర్ ఐ చంద్రశేఖర్ కు అందజేశారు. ఆయన ఆర్ ఎస్ ఐ విజయ్, ఎఫ్ బి ఒ జానీబాషా టీమ్ ను కూడా పంపించారు. వీరు రాగిమాకులకుంట వద్ద మాటు వేయగా స్మగ్లర్లు కదలికలు కనిపించాయి.ఇద్దరు వ్యక్తులు ఆరు దుంగలను అప్పుడే వచ్చిన ఆటోలో వేయడానికి ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టారు. రవాణా చేస్తున్న ఇద్దరు పట్టుకున్నారు. పట్టుబడిన వారు తిరుపతి ఐ ఎస్ మహల్ పరిసర ప్రాంతాలకు చెందినవారు

About The Author