సముద్రం బీచ్ ను క్లీన్ చేసిన మోడీ.

https://www.youtube.com/watch?v=MYMmF5h_D4Q
స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఇవ్వడమే కాదు.. దాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు ప్రధాని మోదీ. గతంలో చీపురు పట్టి వీధులు ఊడ్చిన పీఎం.. ఇప్పుడు బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో చర్చల్లో భాగంగా ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటిస్తున్న విషయం తెలిసింది. శుక్రవారం తొలి దశ చర్చలు అనంతరం.. మామల్లాపురంలో ఓ హోటల్‌లో బస చేశారు. తెల్లవారుజామున నిద్రలేవగానే హోటల్‌కు సమీపంలోని కోవలం బీచ్‌లో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లారు. అయితే ఆయన కేవలం వాకింగ్ మాత్రమే చేయకుండా.. అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం మొదలుపెట్టారు. సుమారు అరగంటసేపు చెత్తను ఏరి తన దగ్గరున్న సంచిలో వేసుకున్నారు. అనంతరం ఆ సంచిని తను బస చేసిన హోటల్‌ సిబ్బంది జయరాజ్‌కు అందించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జనం సంచరించే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని.. అలాగే ఫిట్‌గా ఉంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ట్వీట్ చేశారు.

About The Author