అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు, నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం…


గుంటూరు, కృష్ణా జిల్లాలలో పలు పాఠశాలలు, మదరసాలు లొ అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మరియు యూత్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారుక్ షిబ్లి ఆధ్వర్యంలో విద్యార్థి, విద్యార్థులలకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ మరియు యు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు హాజీ ఫారుక్

షిబ్లీ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎప్పుడు మర్చిపోను అటువంటి మహానుభావుడు జైనులాబ్దిన్ గారికి కలిగిన సంతానం తమిళనాడు లోని రామేశ్వరంలో 1931వ సంవత్సరంలో జన్మించడం జరిగింది, అబ్దుల్ కలాం గారి తండ్రి ఒక మసీదు ఇమామ్ గా వ్యవహరించేవారు అబ్దుల్ కలాం గారికి అత్యంత సన్నిహితుడు చిన్ననాటి మిత్రుడు లక్ష్మణ శాస్త్రి వారి తండ్రిగారు ప్రముఖ రామేశ్వరం మందిరంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించేవారు చిన్ననాటి తరగతిలో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం మరియు లక్ష్మణ శాస్త్రి గారికి పాఠాలు నేర్పించే ఉపాధ్యాయులు ఒకరు మతాల మధ్య వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు అది గమనించిన లక్ష్మణ శాస్త్రి వారి తండ్రి గారికి ఈ విషయాన్ని చేసినప్పుడు ఆయన ఉపాధ్యాయుడిని తన ఇంటి వద్దకు పిలిపించి అబ్దుల్ కలాం క్షమాపణ చెప్పిస్తారు ఆ రకంగా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఇస్రో మరియు డి ఆర్ డి ఓ వో , వరకు ఆయన అభివృద్ధి దిశగా పంపించారు ఈ ప్రయాణంలోనే ఎన్నో ప్రముఖ అగ్ని మరియు పృథ్వి అన్న మిసైల్ లను తయారు చేసినందుకు గాను ఆయన్ని మిస్సైల్ మాన్ అని కూడా బిరుదు ప్రదానం చేయడం జరిగింది ఇంత వరకే కాకుండా ఆయన సుమారు 25 పుస్తకాలను రచించారు అందులో నుండి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం భారతదేశ యువకుల మనసులను దోచుకుంది ఈ ప్రయాణంలో భాగంగా 1997లో భారతదేశ ప్రభుత్వం భారతరత్న బిరుదు తో పాటు పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ అత్యున్నత పురస్కారాలతో ఆయన్ని సన్మానించింది, అంతేకాకుండా ప్రముఖ ఏడు విద్యాసంస్థలు లో ఆయన్ని డాక్టరేట్ బిరుదుతో సన్మానించడం జరిగింది రాష్ట్రపతి భవన్ లో ఉండగా కేవలం రెండు గదుల కే పరిమితమై తన సాధారణమైన జీవితాన్ని దేశ రాష్ట్రపతి అయ్యుండి కూడా ఒక ఉదాహరణ అని భారతదేశ ప్రజల ముందు ఆయన ఉంచడం జరిగింది

2015 జూలై 27 వ తేదీన, ఐ ఐ ఏం, నందు ప్రసంగిస్తూ కార్డియాక్ అరెస్ట్ వల్ల తుదిశ్వాసను విడిచారు. ఆయన మొత్తం జీవితం ప్రతి భారతీయుడికి మరియు మరియు మరీ ముఖ్యంగా యువతరానికి ఒక ఆదర్శం లాంటిది. ఆయన మరణానంతరం ఆయనకి చెందిన ఆస్తులు కేవలం రెండు జతల బట్టలు మాత్రమే ఈ రోజు కూడా ఆయన కుటుంబ సభ్యులు తమిళనాడులోని ఒక మారుమూల ప్రాంతంలో అతి సామాన్య జీవితాన్ని గడపటం గమనార్హం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్య నిర్వాహక సభ్యులు మౌలానా హుస్సేన్, సయ్యద్ మస్తాన్, అబ్దుల్ రజాక్, షేక్ ముస్తఫా మరియు తదితరులు పాల్గొన్నారు.

About The Author