రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు అందరూ నూతన ఒరవడితో..!
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు అందరూ నూతన ఒరవడితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా ఏర్పడటం అభినందనీయమని తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్.వి.యూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా మొదటి కౌన్సిల్ సమావేశానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, ప్రభుత్వ విప్ మతీయు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరయి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.
తిరుపతి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ఒకే సంఘంగా ఏర్పడటం సంతోషమని ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వా ఆశయాలను అమలు చేసే భాద్యత ఉద్యోగులదేనని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల భాద్యత , బద్రతకు ప్రదాన్యతనిచ్చే వ్యక్తి అని రాష్ట్రంలో సమ్మెకు తావిచ్చే వ్యక్తి మన ముఖ్యమంత్రి కాదని అన్నారు.
తిరుపతి శాసన సభ్యులు ప్రసంగిస్తూ చిత్తశుద్దితో ఉద్యోగ సంఘాల నాయకులు పనిచేసి మీకు కావలసిన అవసరాలు, రావలసినవి పరిష్కరించుకునే విధంగా ఉండాలని అన్నారు.