రామజన్మ భూమి విషయంలో నాకు నిన్నో కొత్త విషయం తెలిసింది.


రామజన్మ భూమి విషయంలో నాకు నిన్నో కొత్త విషయం తెలిసింది. ఈ విషయం నాకు ఇన్ని రోజులూ తెలియకపోవడం నిజంగా సిగ్గు చేటు.

రామాజన్మ భూమి, రామ జన్మభూమి అంటుంటే, రాముడు అయోధ్యలో పుట్టాడు కనుక, అయోధ్య మొత్తం రామ జన్మ భూమే, ఈ దేవాలయం అయోధ్య నగరంలో ఉంది అనుకునే వాడిని. కానీ విషయం అది మాత్రమే కాదు. రాముడు అయోధ్య నగరంలో ఖచ్చితంగా ఎక్కడ జన్మించాడో, ఖచ్చితంగా అదే ప్రదేశంలో అయోధ్య రామ మందిరం ఉండేది. నాకు అర్థం అయినంత వరకూ దేవాలయం గర్భ గుడి ఉన్న ప్రదేశంలోనే రామ జననం జరిగింది. ప్రస్తుతం అక్కడే మసీదు ఉంది. అందుకే అక్కడ రాముడిని “రామ్ లల్లా” అంటే “బాల రాముడు” అంటారు. ఆ ఆలయాన్ని బాబర్ కూలగొట్టి అక్కడ మసీదు కట్టాడు. అంటే మన రాముడు పుట్టిన స్థలంలో మసీదు కట్టేశారన్నమాట. కాబట్టి దేవాలయం ఖచ్చితంగా అక్కడే ఉండి తీరాలి. దానికి వేరే ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు.

ఇస్లాంలో విగ్రహారాధన నిషేధం. కనుక వారి దృష్టిలో మసీదుకు ప్రత్యేక పవిత్రత అంటూ ఏమీ ఉండదు. అది కేవలం అందరూ కలిసి ప్రార్ధన చేసుకునే ఒక నిర్మాణం. ఆ నిర్మాణం ఎక్కడైనా ఉండవచ్చు. అందుకే రహదారి విస్తరణలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా, ముస్లిం దేశాలతో సహా, ఎన్నో సార్లు మసీదులను కూల్చేశారు. ప్రభుత్వం అటువంటి సందర్భాలలో వారికి నష్టపరిహారం ఇస్తుంది. వారు మసీదుని మరో చోట నిర్మించుకుంటారు. బాబ్రీ మసీదు కూడా అటువంటిదే. ముస్లింలకు సంబంధించినంత వరకూ దానికి ఎటువంటి ప్రత్యేకతా లేదు. పైగా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ప్రార్థనలు కూడా జరగడం లేదు.

ఒకపక్క హిందువులకి అది శ్రీరాముడు పుట్టిన స్థలం, అంటే హిందువులకి సంబంధించి అది అత్యంత పవిత్రమైన స్థలం. ముస్లింలకి సంబంధించి ఎన్నో లక్షల మసీదులలానే అది కూడా ఒకటి అంతే. ముస్లింల స్థానంలో హిందువులు ఉంటే, ఖచ్చితంగా మనం ఎప్పుడో ఆ స్థలాన్ని వారికి అప్పగించేవారము. అసలు వివాదమే ఉండేది కాదు.

హిందువులకు ఆ స్థలం అత్యంత పవిత్రం, ముస్లింలకు అది అన్ని ఇతర స్థలాల వంటిది. ఎవరు పక్కకు తొలగాలి? ముస్లింలు కూడా ఒకసారి ఆలోచించాలి. అందుకే సుబ్రహ్మణ్య స్వామి గారు వేరే విధంగా న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. “రాముడు అదే స్థలంలో పుట్టాడు అనేది హిందువుల నమ్మకం, కనుక అక్కడ నేను ఆయనని పూజించగలగడం నా ప్రాధమిక హక్కు” అనేది ఆయన వాదన.

About The Author