టాస్క్ ఫోర్స్ లో అమర వీరుల సంస్మరణ దినోత్సవం అమర వీరులకు అంజలి ఘటించిన ఎస్పీ

 

వారం రోజులుగా అమర వీరులను సంస్మరించుకుంటూ పలు కార్యక్రమాలను చేపట్టిన టాస్క్ ఫోర్స్ సోమవారం తమ కార్యాలయ ప్రాంగణంలో అమరవీరుల స్థూపానికి ఘనంగా అంజలి ఘటించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారు పోలీసుల నుంచి సంప్రదాయం ప్రకారం గౌరవ వందనం స్వీకరించారు. తరువాత అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో పాటుగా డీఎస్పీలు అల్లా బక్ష్, వెంకటయ్య, ఎసిఎఫ్ కృష్ణయ్య ఇతర అధికారులు అంజలి ఘటించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారు మాట్లాడుతూ అమర వీరుల తమ ప్రాణాల  త్యాగ ఫలితంగా దేశం ప్రశాంతంగా ఉందని అన్నారు.‌1959లో లఢక్ లో జరిగిన చైనా దాడుల్లో పది మంది సీఆర్పిఎఫ్ జవానులు వీరమరణం పొందారని అన్నారు. వారిని స్మరించుకునేందుకు 1960 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 అమర వీరులను సంస్మరణ చేసుకుంటున్నామని అన్నారు. ఈ సంవత్సరం మాత్రమే 292 మంది వీర మరణం పొందారని, అందులో ఇద్దరు రాష్టానికి చెందినవారు ఉన్నారని తెలిపారు. ఇటీవల ఏర్పడుతున్న అంతర్గత సమస్యలను కూడా అధిగమించేలా పోలీసులు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. 

About The Author