జర్మనీ లోని బెర్లిన్ చేరుకున్న వ్యయసాయశాఖ మంత్రి టీం…


తెలంగాణ విత్తన రంగ అభివృద్దికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో కూడిన బృందం మంగళవారం ఉదయం బెర్లిన్ చేరుకుంది. ఈ బృందానికి విమానాశ్రయంలో జర్మనీ ప్రతినిధి బృందం నుండి సాదరస్వాగతం లభించింది.
ఈ బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో పాటు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి గారు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, చెన్నమనేని రమేశ్ గారు, విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు గారు, విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్ డా. కేశవులు గార్లు ఉన్నారు.ఇండో-జర్మన్ విత్తన రంగ సహకార ప్రాజెక్ట్ ద్వారా, జర్మన్ ఆహార మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ బృందం పర్యటనకు వెళ్లింది.నేటి నుండి నవంబర్ 6 వరకు, 8 రోజుల పాటు జర్మనీ మరియు నెథర్లాండ్స్ దేశాలలో ఈ బృందం పర్యటించనున్నదిజర్మనీ మరియు నెథర్లాండ్స్ దేశాలలో విత్తన రంగ అభివృద్ది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రి, వ్యవసాయ రంగ పథకాలు, పంటల సాగు విధానాలు, వ్యవసాయ రంగం లో సహకార సంఘాల వ్యవస్థపై వ్యవసాయ శాఖా మంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం అధ్యయనం చేయనున్నది.

About The Author