పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నాఛత్తీస్‌ గఢ్ సీఎం..


ఛత్తీస్‌ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ గుడిలో పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. రాయ్‌ పూర్‌ లోని దుర్గ్‌ లో ఓ ఆలయాన్ని సీఎం భూపేష్ భగల్ సందర్శించారు. అయితే, అక్కడ ఆలయ సంప్రదాయం ప్రకారం.. అమ్మవారి ఎదుట పూజారీ చేత్తో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి కూడా కొరడా దెబ్బలు తినేందుకు సిద్ధమయ్యారు. తన కుడిచేతి చొక్కాను కొంచెం పైకి లాగారు. అనంతరం పూజారి ముఖ్యమంత్రి చేతిపై కొరడా దెబ్బలను కొట్టారు. ఆరు కొరడా దెబ్బలు పడిన తర్వాత ముఖ్యమంత్రి ఇక చాలు అన్నట్టుగా తన చేతిని వెనక్కు తీశారు. కొరడా దెబ్బలు తింటున్న సమయంలో ముఖ్యమంత్రి భూపేష్ భగల్ నవ్వుతూ కనిపించారు.

About The Author