నాగులచవితి పూజా విధానం. నాగులచవితి శుభాకాంక్షలు
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు.ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివ భావముతో పూజిస్తే సర్వరోగ భాదలు తొలగి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుపాము అని అంటారు.
అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మధ,మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని పుట్టకు పూజ చేయడంలో గల అంతర్యమని చెప్తారు.
నాగుల చవితి పూజా విధానం :-
నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇంట్లో దేవుని వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.తర్వాత పూజా మందిరమును మరియు ఇళ్ళును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి.
నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూలు,ఎర్ర గులాబిలు,ఏవేని ఎర్రటి పువ్వులను పూజకు ఉపయోగించాలి. నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి.
పూజకు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్ర నామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో “ఓం నాగేంద్రస్వామినే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు వెళ్ళి దీపం వెలిగించి పుట్ట దగ్గర ఆవుపాలను ఒక దొప్పలో పోసి పుట్టపై పెట్టాలి తప్ప పుట్టలో పాలు పోయకూడదు.పాము పాలు తాగదు గమనించాలి.అక్కడ ఏదైన నాగదేవత విగ్రహం కనక ఉన్నట్లు అయితే విగ్రహమునకు అభిషేకం పాలతో చేయవచ్చును.
కోడి గుడ్డు సమర్పించాలనుకునే వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్టకున్న రంద్రాలలో వేయకూడదు,పెట్టకూడదు.పాము పుట్టలోకి వెళ్ళె మార్గానికి అంతరాయం కలిగించ కూడదు.ఆ తర్వాత బియ్యం పిండిలో చక్కర కలిపి పుట్టపై చల్లాలి ఆ తర్వత పూజకోరకు తీసుకు వెళ్ళిన పసుపు,కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి దూప దీప నైవెద్యాలు సమర్పరించిన తర్వత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళను పుట్టపై చల్లాలి.పుట్టచుట్టూ అక్షితలు చేతబట్టుకుని మూడు ప్రదక్షిణలు చేయాలి.
హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి.ఇక్కడ మగవారు సాస్టాంగం,ఆడవారు మోకాలి పై వంగి ,గర్భిని స్థ్రీలు నిలబడి నమస్కరించు కోవాలి.సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి.ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబందమైన దోషాలకు చక్కటి తరునోపాయం.భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం జై శ్రీమన్నారాయణ.