బాబ్రీ మసీద్ తీర్పు ఎలా ఉన్నా స్వాగతిద్దాం- షారుక్ షుబ్లీ


ఈరోజు విజయవాడ వాగు సెంటర్ నందు కల ఆంజనేయస్వామి గుడి వద్ద మత సామరస్యానికి ప్రతీకగా అయ్యప్పలకు అన్నదానం కార్యక్రమం యూత్ వెల్ఫేర్ మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఫారూఖ్ షిబ్లి మాట్లాడుతూ దేశ సమైక్యత మరియు సమగ్రత కొరకు మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా యూత్ వెల్ఫేర్ గత ఏడు సంవత్సరాల నుండి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. *దేశంలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, భారతదేశ పౌరులు వెయ్యి కళ్ళతో వేచి ఉన్న అత్యున్నత ధర్మాసనం యొక్క నిర్ణయం రామ్ మందిర్ మరియు బాబ్రీ మసీదు వివాదం పై తీర్పు వెలువడుతుంది కాబట్టి తీర్పు ఏటు వచ్చిన ఇరువర్గాలు సామరస్యం మరియు సమన్వయం పాటించలే తప్ప ఒకరి గెలుపు ఒకరి ఓటమి అని అనుకోకుండా భారతదేశం యొక్క గొప్ప గెలుపు గా భావించాలి అని షిబ్లి పిలుపునిచ్చారు.*
భిన్నత్వంలో ఏకత్వం ఇదే దేశ ప్రగతికి మూలమంత్రం అన్న సిద్ధాంతాన్ని ప్రతి భారతీయ పౌరుడులో నరనరాన జీర్ణించుకుని పోయేటట్లుగా యూత్ వెల్ఫేర్ రాబోయే రోజుల్లో కూడా కృషి చేస్తుందని అన్నారు.

*ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న విజయవాడ పోలీస్ కమిష నర్ గారు వన్టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ గారిని ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పంపించి యూత్ వెల్ఫేర్ అధ్యక్షులు షిబ్లిగారిని శాలువా కప్పి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ యూత్ వెల్ఫేర్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం నిజంగా అభినందనీయం భారతదేశం అన్ని కులాలు మతాల యొక్క కలయిక అన్న విషయాన్ని ఈ రకంగా తెలియజేయడం సంతోషించదగ్గ విషయం.*

ఈ కార్యక్రమంలో యూత్ వెల్ఫేర్ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు హర్ మహేందర్ సింగ్ సహని, విజయవాడ యూత్ వెల్ఫేర్ అధ్యక్షులు జాకిర్, జహూరు,రఫీ, రషీద్, మస్తాన్ తదితర సభ్యులు మరియు చిట్టి నగర్ ఈద్గా సభ్యులు పాల్గొన్నారు.

About The Author