అలయనిర్మాణం వరకూ అన్నం తిననని ప్రతిజ్ఞచేసిన స్త్రీమూర్తి :
అయోధ్యలో రామమందిరం కల సాకారం కావాలని ఎదురుచూస్తున్న కోట్లాదిమంది హిందువులలో మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఊర్మిళా చతుర్వేది(81) ప్రత్యేకం.
1992లో బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు నుంచి సాధారణ ఆహారం తీసుకోవడం మానేశారు. 27 ఏళ్లుగా పాలు, పండ్లనే తీసుకుంటున్నారు. అయోధ్య వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఊర్మిళ తిరిగి సాధారణ ఆహారం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.