యూజర్లకు బ్యాడ్‌న్యూస్

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాక్ ఇవ్వబోతోంది.యూట్యూబ్‌కు చెందిన టర్మ్ ఆఫ్ సర్వీస్‌లో యాజమాన్యం కొత్త రూల్స్ తీసుకొచ్చింది.దీని ప్రకారం యాడ్ రెవెన్యూ రాని యూట్యూబ్ ఛానెళ్లను తొలగించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.అంటే యూజర్లు పెట్టే వీడియోలకు యాడ్ రెవెన్యూ అంతంత మాత్రంగానే వచ్చినా.. పూర్తిగా రాకపోయినా ఆ ఛానెల్ ఇకపై కనిపించదు.అంతేకాదు ఆ యూజర్‌కు సంబంధించిన గూగుల్‌ డేటాను కూడా తొలగించనున్నారు.

అంటే జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోస్ తదితర సర్వీసులను కూడా వాడుకోకుండా నిషేధం విధించనున్నారు.2019 డిసెంబర్ 10 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది.దీనిపై యూబ్యూట్‌ అధికార ప్రతినిధులు స్పందిస్తూ.. తమ నిబంధనలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటామని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

దీని వలన యూట్యూబ్ మరింత మందికి చేరువవుతుందని.. కంటెంట్ క్రియేటర్లకు అది మేలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ నిర్ణయంపై వినియోగదారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొత్త కంటెంట్ అందించేవారికి ఈ రూల్స్ నిరాశకు గురి చేస్తాయని.. దీని వలన పెద్ద క్రియేటర్లు మాత్రమే లాభం ఉంటుందని తమ నిరసనను తెలుపుతున్నారు.

About The Author