ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి దేవిక..


ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి దేవిక.. కసబ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు దేవిక పేరు అప్పట్లో దేశం యావత్తు మార్మోగింది.

26/11/2008 సంవత్సరం ముంబైలో పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రత్యక్ష సాక్షి ఆరేళ్ల దేవిక. ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్‌(CST )లో అమాయకులను పొట్టనబెట్టుకున్న లష్కరే ఉగ్రవాది కసబ్‌ను పోలీసులు పట్టుకున్నాక అతడిని పోలీసు పరేడ్‌లో గుర్తుపట్టిన అత్యంత చిన్న వయసు ప్రత్యక్ష సాక్షి ఈమె.

ఉగ్రవాదిని గుర్తించడంలో సాయం చేసినందుకు ఆ కుటుంబం ఎదుర్కొన్న చేదు అనుభవం ఒకటైతే, ఆ చిన్ని మనసును నొప్పించిన ఘటనలెన్నో. 2008 నవంబర్‌ 26న పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదుల బుల్లెట్ల నుంచి దేవిక త్రుటిలో తప్పించుకుంది.

కసబ్‌ని గుర్తుపట్టి, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు నాడు కోర్టు మెట్లెక్కినపుడు దేవిక వయసు తొమ్మిదేళ్లు. ఘటన జరిగినపుడు ఆమె వయసు కేవలం ఆరేళ్లు. ‘నా కుడి కాలుని షూట్‌ చేశారు’ అంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది దేవిక.

ప్రస్తుతం దేవిక ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. దాడి జరిగిన రోజు పుణెలోని తన చిన్న అన్నయ్యను కలవడానికి తండ్రి నట్వర్‌లాల్, పెద్ద అన్నయ్యలతో కలిసి రైలెక్కడానికి ముంబై CST రైల్వే స్టేషన్ వచ్చింది. అదే సమయంలో రైల్వేస్టేషన్‌లో కసబ్‌ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్‌ దేవిక కుడి కాలును చీల్చుకుంటూ దూసుకెళ్లింది. రక్తసిక్తమైన దేవిక రెండు నెలల పాటు ఆసుపత్రిపాలైంది.

కోలుకుని కోర్టుకెళ్లిన దేవికను ‘నిన్నెవరు కాల్చారు?’ అని ప్రశ్నించినపుడు సూటిగా కసబ్‌ వైపు చూపించింది. దీంతో అప్పట్లో దేవిక పేరు మార్మోగింది. దేశం యావత్తు ఆ చిన్నారి తెగువను ప్రశంసించింది. అయితే, దేవికను కష్టాలు మరోరూపంలో మొదలయ్యాయి. బడిలో తోటి విద్యార్థినులు ‘కసబ్‌కీ బేటీ’ అని పిలిచేవారు. స్నేహితులు దగ్గరికి రావడానికి భయపడ్డారు. సూటిపోటి మాటలతో వేధించారు. దీంతో దేవిక మరో పాఠశాలలో చేరాల్సి వచ్చింది. అక్కడా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు.

దీనికితోడు ఒక దురదృష్టకరమైన విషయం ఏమిటంటే దేవిక కుటుంబానికి స్థానిక #ముస్లింమతోన్మాదులుఉగ్రవాదుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అయినా దేవిక ఆమె కుటుంబం వెనక్కి తగ్గలేదు. దేవిక తండ్రి ఒక రోజు కూలీ. ఇంత పేదరికంలోనూ తను లక్ష్యంగా పెట్టుకున్న IPS ఆశయాన్ని సాధించేందుకు దేవిక కష్టపడి చదువుతోంది…..
Prasada Rao Guduru

About The Author