రాయలసీమ జిల్లాల్లో పవన్ టూర్ ఖరారు…
రాయలసీమ జిల్లాల్లో పవన్ టూర్ ఖరారు
డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఆరు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటన కొనసాగుతుంది
రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపట్టనున్న పవన్
అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల పై ప్రజలతో ముఖాముఖి
సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారిని కలవనున్న పవన్
డిసెంబరు 1 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు.
3 గంటలకు రైల్వే కోడూరు లో కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు.
కడప జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు
రాత్రి కి తిరుపతిలో బస
2 వ తేదీ ఉదయం 10 గం. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం
3 వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష
4 వ తేదీ మదనపల్లె లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, శ్రేణులకు దిశానిర్దేశం
5 వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం
అనంతరం స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చ
6 వ తేదీన పార్టీ కార్యక్రమాలలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
రాయలసీమ జిల్లాల్లో జనసేన నాయకులూ, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం మూలంగా ఇబ్బందులుపడుతున్నవారికి భరోసా ఇస్తారు.