ఢిల్లీలో స్వచ్ఛమైన గాలిని అమ్ముతున్నారట!
15 నిమిషాలు పీల్చడానికి 299 రూ. చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా, నమ్మలేనట్లుగా ఉంది కద? 15 – 20 సం. ల క్రితం మంచి నీళ్ళు సీసాలు అమ్మటం మొదలెట్టినప్పుడు నేను ఇలానే అనుకున్నాను. 10 రూపాయలు పెట్టి లీటర్ నీళ్లు కొనుక్కుని ఎవడు తాగుతాడు అని.
వ్యాపారస్తులు దేనినైనా అమ్మగలరు
1. కాలుష్యాన్ని తయారు చేసి సంపాదిస్తారు
2. ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి మళ్లీ ఎయిర్ ఫ్యూరిఫయర్ లు అమ్ముతారు, ఆక్సిజన్ బార్ లు తెరుస్తారు. తద్వారా మళ్లీ సంపాదిస్తారు
నా చిన్నతనంలో ఎక్కడ పడితే అక్కడే నీళ్లు తాగేవారం. కానీ ఇప్పుడు నీళ్ల సీసాలు కనుక్కోవడం సాధారణం అయిపోయింది. బహుశా భవిష్యత్ లో ప్రతీ ఒక్కడూ భుజాన చిన్న ఆక్సిజన్ సిలెండర్ వేసుకుని తిరుగుతాడేమో
అసలు ఢిల్లీలో కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి మోన్సేంటో అనే విత్తనాలు అమ్మే సంస్థ ఆట. వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కొరకు పంజాబ్, హర్యాణా ప్రభుత్వాల సహాయంతో అక్కడి రైతులు పంట వేసే కాలంలో మార్పులు చేయించారు. దీని వలన ఆ పంటకూ, తరువాతి పంటకూ మధ్య సమయం తగ్గిపోయింది, కనుక తమ వ్యవసాయ వ్యర్ధాలను కాల్చడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేని స్థితికి రైతులు వచ్చారు. ఈ వ్యవసాయ వ్యర్ధాలు కాల్చడమే ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణం.
ఇదంతా చూస్తుంటే, ధృవ సినిమాలో ఒక డైలాగ్ గుర్తు రావడం లేదు?
“మనమెవరం వార్తా పత్రికల మధ్యలో ఉండే, వ్యాపార సంబంధ వార్తలను పట్టించుకొము, కానీ నిజానికి ఆ వార్తలే మిగిలిన అన్ని వార్తలనీ నిర్ణయిస్తాయి”
ప్రతీదాని వెనుకా ఒక వ్యాపార ప్రయోజనం ఉంటుందా?