అరేబియా సముద్రంలో నిష్కలంకమహాదేవ ఆలయం…


గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి దగ్గర్లో ఉన్న #కోలియాక్ గ్రామానికి సమీపంలో అరేబియా సముద్రంలో #నిష్కలంకమహాదేవ ఆలయం’ఉంది.
ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంటుంది. తర్వాత మెల్లగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి శివ లింగానికి పూజలు చేస్తారు.
ఇలా రాత్రి పదిగంటల వరకూ అక్కడే కాలం గడపొచ్చు. ఆ సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే! ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీటముంచుతుంది. అంటే మళ్లీ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆలయం కనిపించదన్నమాట! అదీ అక్కడి విశేషం. ఆలయ ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తువరకు నీళ్లు వచ్చేస్తాయి.
కొన్ని వందల ఏళ్ళుగా ఇక్కడ ఇలాగే జరుగుతోందట. ఈ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారన్నది స్థలపురాణ గాథ! పౌర్ణమి రాత్రి పోటు సమయంలో పదిగంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేయడం, మెల్లిగా ఆలయాన్ని తన గర్భంలో దాచేసుకునే దృశ్యం అక్కడి యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుంది.

About The Author