కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నడిపే భవిత కేంద్రాలు


బడికి వెళ్లి చదువుకోవడం కష్టంగా ఉన్న దివ్యఅంగ విద్యార్థులు కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నడిపే భవిత కేంద్రాలు సంగారెడ్డి జిల్లాలో దివ్యంగా విద్యార్థుల కు ఎంతో ఉపయోగపడ్తున్నాయి.

. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పఠాన్ చేరు భవిత సెంటర్ మండలంలోని అన్ని రకాల వికలాంగుల చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతుంది. మండలంలోని వివిధ గ్రామాల నుండి దివ్యంగా చిన్నారులను వారి తల్లిదండ్రులు స్వయంగా కేంద్రానికి తీసుకు రావటం వల్ల ఆ చిన్నారులు భవిత కేంద్రము ద్వారా శిక్షణ పొందుతారు. విద్యార్థుల్లో మార్పు వచ్చిన తర్వాత వారి వయస్సు ను బట్టి వాటిని ఆయా తరగతుల్లో చేర్పిస్తారు.శారీరకంగా ఇబ్బంది తో భవిత కేంద్రానికి రాలేని పిల్లలను గుర్తించి స్వయంగా వారి ఇంటికి వెళ్లి భవిత సెంటర్ ద్వారా సేవలు అందిస్తారు. భవిత కేంద్రంలో అవసరమైన అన్ని రకాల వసతులు, పరికరాలు సమకూర్చుతారు..విద్యార్థుల కు మద్యాహ్నం భోజనం కూడా అందుబాటులో ఉంచుతారు. ఈ భవిత సెంటర్ శిక్షణ పొందిన విద్యార్థుల కు వైద్య పరీక్షలు నిర్వహించి సదరన్ క్యాంప్ ద్వారా సర్టిఫికేట్ వచ్చేలా చేయడం వల్ల వారికి ప్రభుత్వం నుండి ప్రతి నెల పింఛను పొందుతారు.మండలంలోని అన్ని గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.

సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజకవర్గం (VKC విలేకరి)

About The Author