దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్…


హైదరాబాద్:దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు.

కాగా.. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు పోలీసులు. గత రాత్రి సీన్ రీ కన్‌స్ట్రేషన్ చేస్తుండగా.. నలుగురూ తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. దీంతో.. వారిపై.. కాల్పులు జరిపక తప్పలేదని.. నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఎన్‌ కౌంటర్ జరిగింది. తెల్లవారు జామున 3 నుంచి 5.30 గంటల ప్రాంతంలో ఎన్‌ కౌంటర్ జరిగినిట్టు సమాచారం.

హైదరాబాద్‌‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యాచారం కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచింది. అంత్యంత కిరాతకంగా.. ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసిన వైనం… మనసున్న ప్రతీ మానవుడిని కలిచివేసింది. ఈ హత్యపై అటు రాజకీయ నాయకులు.. ఇటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. అంతేకాకుండా.. గత కొద్ది రోజులుగా.. ఈ నలుగురు నిందితులను ఉరి తీయాలని.. ప్రజలందరూ పెద్ద ఎత్తున.. నిరసనలు, ర్యాలీలు చేశారు.

అయితే.. అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా.. సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉండగా.. యాసిడ్ అటాక్ నిందితుల్ని కూడా ఎన్‌కౌంటర్ చేశారు
#Dishaencounter #Bigbreaking

About The Author