ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థినిని ప్రాణాలకు తెగించి నదిలోకి దూకి రక్షించిన ఏ ఎస్ ఐ మాణిక్యాలరావు…
దీవిసీమలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థినిని ప్రాణాలకు తెగించి నదిలోకి దూకి రక్షించిన ఏ ఎస్ ఐ మాణిక్యాలరావు**
జిల్లాలో నిర్వహిస్తున్న నో యాక్సిడెంట్ డేలో భాగంగా ఈరోజు ఉదయం ఏడు గంటలకు పెనుమూడి వంతెన సమీపంలో విధులు నిర్వహించడానికి వెళ్ళిన ఏఎస్ఐ మాణిక్యాలరావు, కానిస్టేబుల్ గోపిరాజు.
అదే సమయంలో పెనుమూడి వంతెన పై నదిలో దూకడానికి సిద్దంగా ఉన్న యువతిని చూసి అటుగా వెళ్తున్న వాహనదారు సమాచారాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న మాణిక్యాలరావు కు చెప్పడంతో,
వెంటనే మాణిక్యాలరావు కానిస్టేబుల్ గోపిరాజును వెంటబెట్టుకుని, సంఘటనా ప్రాంతానికి చేరుకునే సమయానికి ఆ యువతి నదిలోనికి దూకేసింది.
నదిలో మునిగి పోతున్న యువతినిచూసి తన వయస్సు 58 సంవత్సరాలు అని కూడా ఆలోచించకుండా ఆ యువతిని రక్షించాలనే తపనతో ప్రాణాలకు సైతం తెగించి వెంటనే నదిలోనికి దూకి…
సుమారు 500 మీటర్ల వరకు ఈదుకుంటూ వెళ్లి ఆ యువతిని రక్షించి, ఒడ్డుకు తీసుకొస్తున్న సమయంలో …..
గోపి రాజు అక్కడున్న స్థానికులను, పడవలు నడిపే జాలర్లను పోగుచేసి పడవ సహాయంతో ఒడ్డుకు చేర్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించి నిండు ప్రాణాన్నికాపాడారు అవనిగడ్డ పోలీసులు.
రిటర్మెంట్ కి దగ్గరలో ఉన్న ASIమాణిక్యాలరావు.. వయస్సుకు మించిన సాహసం