యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా నిలిచిపోయేవి…ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు
యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా నిలిచిపోయేవి కాబట్టి ఏలాంటి తొందరపాటు, ఆతృత అవసరం లేదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరగాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ మంగళవారం ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో పర్యటించారు. మొదట లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. అనంతరం రెండు గంటల పాటు ప్రధాన ఆలయ నిర్మాణ ప్రాంతంలో కలియ తిరిగారు. గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్థంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణీ, యాగశాల తదితర నిర్మాణాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. యాదాద్రి ప్రధాన ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా వున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘ఆలయ నిర్మాణ పనులు ఒక డెడ్ లైన్ పెట్టుకుని చేసేవి కావు. శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు కాబట్టీ ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. ఏ మాత్రం తొందరపాటు అవసరం లేదు. జాగ్రత్త, నాణ్యతా పాటించాలి. నిర్మాణాలు పటిష్టంగా వుండాలి. ప్రతీది నియమాలను అనుసరించి సాగాలి. ఇది సనాతన ఆలయం, ఇక్కడ పూజలు చేయటం చాలా మందికి వారసత్వంగా వస్తున్న సంప్రదాయం. దేశ విదేశాల్లో లక్ష్మి నర్సింహస్వామికి భక్తులున్నారు. రాబోయే కాలంలో యాదాద్రికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ భక్తులకు దైవ దర్శనం విషయంలో కానీ, వసతి సౌకర్యంలో కానీ, పుణ్య స్నానాల విషయంలో కానీ, తలనీలాల సమర్పణలో కానీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యం కావాలి’’ అని సీఎం అన్నారు. జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. రాతి శిలలను అధ్భుత కళాకండాలుగా మలిచిన శిల్పులను అభినందించారు. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండే విధంగా రూపకల్పన చేశారని సీఎం అభినందించారు. 560 మంది శిల్పులు నాలుగేళ్లుగా పడుతున్న కష్టం ఫలించి అధ్భుత ఆకారాలతొ కూడి ప్రాకారాలు సిద్ధమయ్యాయని సీఎం అన్నారు. వందకు వంద శాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్ధడం యాదాద్రిలోనే సాధ్యమయిందని సీఎం అన్నారు. ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు పెంచాలని సీఎం సూచించారు. ఆలయ ప్రాంగణంలో దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీ నర్సింహస్వామి చరిత్ర, స్థలపురాణం ప్రస్పుటించే విధంగా తైల వర్ణ చిత్రాలను వేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అనంతరం యాదాద్రిలో జరుగుతున్న రింగురోడ్డు పనులను పరిశీలించారు. సకల సౌకర్యాలతో కూడిన 15 వివిఐపి కాటేజీలతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ కొన్ని మార్పులను సూచించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వారు వచ్చినప్పటికీ వారికి సౌకర్యవంతంగా వుండేట్లు ప్రెసిడెన్షియల్ సూట్ వుండాలని చెప్పారు. బస్వాపురం రిజర్వాయర్ ను పర్యటాక ప్రాంతంగా మారుస్తున్న విధంగానే ప్రెసిడెన్షియల్ సూట్ కు సమీపంలో వున్న మైలార్ గూడెం చెరువును సుందరీకరించాలని సీఎం ఆదేశించారు. ప్రధాన దేవాలయ వుండే గుట్ట నుండి రింగురోడ్డు మధ్య భాగంలో గతంలో అనుకున్న ప్రకారం నిర్మాణాలన్నీ సాగాలన్నారు. కోనేరు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునిత, రాజ్యసభ సభ్యులు శ్రీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ ఫైల్ల శేఖర్ రెడ్డి, శ్రీ గ్యాదరి కిషోర్, శ్రీ వివేకానంద, ఎమ్మెల్సీలు శ్రీ శేరి సుభాష్ రెడ్డి, శ్రీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, శ్రీ శంభీపూర్ రాజు, జడ్పి చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి, వైటిడిఎ స్పెషల్ ఆఫీసర్ శ్రీ కిషన్ రావు, కలెక్టర్ శ్రీమతి అనితా రామచంద్రన్, ఆలయ ఇవో శ్రీమతి గీత, ఆలయ నిర్మాణ శిల్పి శ్రీ ఆనంద్ సాయి, ఆర్ అండ్ బి ఇఎన్సీలు శ్రీ గణపతి రెడ్డి, శ్రీ రవీందర్ రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి తదితరులు వున్నారు.
Hon’ble CM Sri K. Chandrashekar Rao has made it clear that there is no need for anxiety or hastening of Yadadri Temple renovation works as the Temple renovation works are to remain permanently with quality and as per the laid down Shastras. CM suggested that all the works should be done in accordance with the Agamashastra rules with good quality and with total perfection. CM toured Yadadri for six and a half hours on Tuesday along with officials from various departments. First, the CM performed a special Pooja to Sri Laxmi Narasimha Swamy and took blessings from the Vedic scholars. After, the CM went around the temple premises for two hours. He has keenly examined the works being done at Gopuram, Dwaja Sthambham, Shivalayam, Sanctum Sanctorum, Mada streets, Queue lines, Kitchen where Prasadam is being made, Towers, Pushkarini, Yagashala, etc., CM has expressed satisfaction that all the works of the temple are being done reflecting the spirituality and the traditions.
“Works on Temple cannot be done as per deadlines. Since they are going to be permanent constructions, each and every precaution should be taken on all aspects. Constructions should be done not to disturb the Sanctum Sanctorum’s structure and its prominence. There is no need to hurry the works. Follow caution and quality. Constructions should be strong and everything should be done in tune with the Agamashathra rules. This is an ancient temple. Performing poojas here is a tradition for many handed down from the generations together as a hereditary custom. Laxmi Narasimha Swamy has devotees in the country and other countries too. In the days to come lakhs of devotees will visit Yadadri. Hence the aim should be to ensure that the devotees will have no problem in having the darshan, their stay, their holy bath at Pushkarini and while tonsuring their heads,” the CM said.
CM has expressed satisfaction over the quality of works being done there. He complimented the sculptors who created wonderful sculptures from the hard rocks. The CM also congratulated the way temple premises is designed to fill it with the statues of Gods, Goddess. The CM said it is hard work that was put in by 560 sculptors bore fruit after 4 years in the form of great walls. The temple with cent percent of statues was made possible only at Yadadri. The CM suggested that gardens and green cover should be created for the pleasant atmosphere at the temple premises. The CM also directed the officials concerned to ensure that wall paintings depicting the greatness of the Temple, the story of Laxmi Narasimha Swamy, Sthala Purana should be on display.
Later, the CM examined the ring road works going on at Yadadri. The CM also visited 15 VVIP Cottages being constructed as part of the Presidential Suite. He suggested some changes over there. He said the Presidential suites should be made in such a way that where the President or the Prime Minister can stay comfortably. The CM instructed that like the Baswapurram reservoir, Mylargudem Tank near the Presidential Suite should also be developed as a tourist spot. He said the works on the area in between the Main temple and Ring road should be developed as planned in the past. He wanted the works on the tank (Koneru) should begin.
Ministers Sri Jagdeesh Reddy, Vemula Prashanth Reddy, Sri CH. Malla Reddy. Government whip Smt. G Sunitha, Rajya Sabha Member Sri Santosh Kumar, MLAs Sri Shekar Reddy, Sri Gadari Kishore, Sri Vivekananda, MLCs Sri Seri Subhash Reddy, Sri A Krishna Reddy, Sri Shambipur Raj, ZP Chairman Sri A Sandeep Reddy, YTDA Special Officer Sri Kishan Rao, Collector Ms. Anita Ramachandran, Temple EO Smt. Geetha, Temple Sculptor Sri Ananda Sai, R&B E-in-Cs Sri Ganapathi Reddy, Sri Ravindra Rao, CM Special Secretary Sri Bhoopal Reddy have accompanied the CM.