ఔషధ ఉపయోగాలు…
ఉత్తరేణి ఆకుల రసం కడుపునొప్పికి, అజీర్తికి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.
ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి.
అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
ఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి.
ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంథి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.