గొల్లపూడి జీవిత సత్యాలు


జీవితంలో ఎంతో డబ్బు సంపాదించవచ్చు..ఎంతో పేరు సంపాదించవచ్చు.. సుఖాలని అనుభవించవచ్చు.. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో కోల్పోయిన కొన్ని అనుభూతుల్ని ఎప్పటికీ పొందలేము.. పిల్లల్ని స్కూల్లో దింపడం, పిల్లలకి బొమ్మలు కొనివ్వడం,పిల్లలతో ఆడుకోవడం లాంటి అద్భుత అనుభవాలు ఎన్ని కోట్లు సంపాదించినా దొరకవు.. అందుకే జీవితంలో నాలుగు రాళ్లతో పాటు నాలుగు జ్ఞాపకాలని దాచుకోండి..రేపు వయసు అయిపోయాక అవే మీకు మిగిలే ఆస్తులు.. అన్నారు గొల్లపూడి

ఏడాదికి ముప్పైకి పైగా సినిమాల్లో నటిస్తున్న రోజుల్లో గొల్లపూడికి ఫ్యామిలీని పట్టించుకునే టైం ఉండేది కాదు..ఏ కారు ఎక్కుతున్నారో..ఏ కారు దిగుతున్నారో.. ఏ డ్రెస్ వేసుకుంటున్నారో..ఏ పాత్ర చేస్తున్నారో కూడా తెలిసేది కాదు.. ఉదయం నుంచి రాత్రి వరకూ షూటింగుల్లోనే బిజీ..ఎప్పుడో అర్ధరాత్రి నీరసంగా ఇంటికి వచ్చి పడుకుని ఉదయం నిద్రలేచి షూటింగ్ కి వెళ్లడం ఇదే పని.. కనీసం పిల్లలు ఎలా ఉన్నారో కూడా చూడలేని పరిస్థితి..

ఒకరోజు అర్ధరాత్రి ఇంటికి వచ్చాక భార్య వచ్చి పక్కన కూర్చుని ఏమండీ మీరు ఒక సినిమాలో నటించడానికి ఎంత తీసుకుంటారు.. అని అడిగారు.. ఎందుకూ అని అడిగితే.. ఏమీ లేదు.. ఆ డబ్బులు నేనే మీ ఎకౌంట్ లో వేస్తాను.. ఒక గంట నాకు కూడా టైం ఇవ్వండి అన్నారట ఆమె.. దాంతో ఆశ్చర్యపోయిన గొల్లపూడి..జీవితంలో తాను ఏమి మిస్ అవుతున్నానో అర్థం అయి వెంటనే పిల్లల్ని కారులో ఎక్కించుకుని రాత్రంతా చెన్నై సిటీ మొత్తం తిప్పేవారట..అంతేకాదు తర్వాత ఆయన షూటింగులు క్యాన్సిల్ చేసుకుని ఫ్యామిలీని టూర్ తీసుకెళ్లారట..

గొల్లపూడి మాటలు వింటుంటే..జీవిత విలువలు తెలుసుకోవచ్చు, స్వచ్ఛమైన కల్మషం లేని మనస్తత్వాన్ని, నిజాయితీని చూడొచ్చు..

అందరి “ముక్కు”లా ఉండేది కాదు ఆయన “ముక్కు”..ఆయనకి మాత్రమే ప్రత్యేకం.. అందరి గొంతులా ఉండేది కాదు ఆయన గొంతు.. ఆయనకి మాత్రమే ప్రత్యేకం..అందరికి మాదిరి ఉండేది కాదు ఆయన వ్యక్తిత్వం..ఆయనకు మాత్రమే ప్రత్యేకం..

అందుకే ఆయన గొప్ప మనిషి.. అంతే.. అలాంటి వారిని ఇకపై చూడలేం..ప్రశాంతంగా వెళ్ళండి సర్..శాశ్వతంగా విశ్రాంతి తీసుకోండి.. స్వర్గాన దేవతలు కూడా మీ మంచి మాటలు వినడానికి ఎదురు చూస్తున్నారు..అశోక్ వేములపల్లి

About The Author