ఏషియన్ పెయింట్ పరిశ్రమ సహకారం తో కోపు చెరువు సుందరీకరణ
https://youtu.be/oFIMsYVil8k
పఠాన్ చేరు మండల్ చిన్న కంజ ర్ల గ్రామంలో
కోపు చెరువు ఏసియన్ పెయింట్ పరిశ్రమ సహకారంతో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సుందరీకరణ మండల పరిధిలో పనులను చేశారు. గ్రామంలో జరిగిన సమావేశంలో సుందరీకరణ పత్రాన్ని చిన్న కంజర్ల సర్పంచ్ నారాయణరెడ్డికి ఆయన అందజేశారు. చిన్న కంజర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సామూహిక నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గోపాలకృష్ణన్ మాట్లాడుతూ తమ పరిశ్రమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులలో సగం నిధులను చెరువుులు కుంటలను పరిరక్షించడానికి ఖర్చు చేస్తామన్నారు. మిగతా సగం విద్య ఆరోగ్య విషయాలకు వినియోగిస్తామన్నారు. నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ డైరెక్టర్ మురుగన్ మాట్లాడుతూ తమ పౌండేషన్ తరఫున తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మొదటి సామాజిక సేవా కార్యక్రమం ఇదేనని తెలిపారు. ఏసియన్ పెయింట్స్ పరిశ్రమ సహకారంతో ముందు ముందు నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటల సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. భూగర్భ జల శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ నీటిని విచ్చలవిడిగా వాడుతూ, వృధా చేస్తే భూగర్భ జలాలు తగ్గిపోయి ఎడారిలా మారే ప్రమాదముందన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడుుు గుంతలను ఏర్పా చేసి, నిత్యం మనం వినియోగించే నీటి కంటేే ఎక్కువగా రీఛార్జ్ చెయ్యాలని సూచించారు. ప్రతి గ్రామంలో నీటి మేనేజ్మెంట్్ కమిటీలను
ఏర్పాటు చేసుకుంటే, నీటి వినియోగంపై తమ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఏసియన్ పెయింట్స్ పరిశ్రమ సీనియర్ మేనేజర్లు సతీష్ కుమార్, దుర్గాప్రసాద్, ఇరిగేషన్ డిఈ ఉదయ్ భాస్కర్, ఏఈ చక్రవర్తి, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ అధికారులు విజయ్ సుందర్, దినేష్ కుమార్, రామస్వామి, సాయి దరన్, రైతులు తదితరులు పాల్గొన్నారు…..
సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరునియోజకవర్గం(VKC విలేకరి)