కేతుగ్రస్థ కంకణాకార సూర్యగ్రహణం..  ఏ ఏ రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుందో చూద్దామా!

శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య డిసెంబర్ 26 గురువారం 2019 ఉదయం ఏర్పడే సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఏడాదిలో చిట్టచివరి, సంపూర్ణ సూర్యగ్రహణం

ప్రధానాంశాలు:-

డిసెంబరు 26న ఏడాదిలో చిట్టచివరి, సంపూర్ణ సూర్యగ్రహణం.మూల నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడనున్న సూర్యగ్రహణం.దేశవ్యాప్తంగా కనువిందు చేయనున్న కేతుగ్రస్థ కంకణాకార గ్రహణం.

ఈ ఏడాదిలో చిట్టచివరి, మూడో సూర్యగ్రహణం డిసెంబరు 26న గురువారం సంభవించనుంది. 

ఉదయం 8 గంటలకు ప్రారంభమై 11.10 వరకు కొనసాగుతుంది. మూల నక్షత్రం మకర , కుంభ లగ్నాలలో ధనుస్సు రాశిలో త్రిపాదాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

భారత కాలమానం ప్రకారం 

స్పర్శ కాలం ఉదయం 8 గంటల 9 నిమిషాలకు ప్రారంభం కాగా, మధ్యకాలం ఉదయం 9 గంటల 31 నిమిషాలు,

మోక్ష కాలం ఉదయం 11.11 నిమిషాలకు పూర్తి అవుతుంది. మొత్తం పుణ్యకాలం సమయం మూడు గంటల రెండు నిమిషాలు.

ఈ గ్రహణం భార‌తదేశం, శ్రీలంక‌, కొన్ని గ‌ల్ఫ్ దేశాలు, సుమ‌త్రా, మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో కనువిందు చేయనుంది. ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం మ‌రో 16 ఏళ్లు తర్వాత సంభవిస్తుంది.

ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని ఆరాశి వారు, అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశి వారు, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిదని జ్యోతిషులు చెబుతున్నారు.

గ్రహణ సమయంలో సూర్యకిరణాలు పడకుండా చూడాలని అంటున్నారు. మిగతా రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంటున్నారు.

సూర్యుడు వ్యక్తిత్వానికి, సాత్విక గుణానికి కారకుడు… అహంకారానికి, తమోగుణానికి రాహువు కారకుడు ఈ రెండింటి కలయిక మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది కాబట్టి తమ జన్మరాశుల్లోని చెడు స్థానాల్లో గ్రహణం సంభవించినవారు చూడరాదని పూర్వీకులు సూచించారు. 

అయితే దీని ప్రభావం చాలా తక్కువ శాతం ఉంటుంది ..ఎందుకంటే ఏ వ్యక్తిపై అయినా కూడా అతను పుట్టిన సమయానికి ఉన్న జాతక ప్రభావం అనేదే ఎక్కువ ఉంటుంది తప్ప గ్రహణ ప్రభావం కాదని, అది జీవితాన్ని ప్రభావితం చేయదని జ్యోతిషులు చెబుతున్నారు.

సూర్యుడు , భూమికి మధ్యలో చంద్రుడు వచ్చి ఆ నీడ సూర్యుడిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుంచి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. 

అందుకే దీనిని కంకణాకార గ్రహణం అంటున్నారు.

మార్గశిర అమావాస్య నాటి అబ్ధిక కార్యక్రామాన్ని యధావిధిగా అపరాహ్నం కాలంలో జరుపుకోవచ్చుని పండితులు చెబుతున్నారు. గ్రహణ పట్టు, విడుపు మధ్యస్నానాలాచరించే వారు వారికున్న మంత్రనుష్టానాలతో ఆచరించి యధావిధిగా స్నానాదులు ఆచరించికోవచ్చట.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర, రాశ్యాదులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. 

ఎవరి జన్మరాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుందో వారు విశేషంగా పూజలు, జపాలు, దానాలు చేయాలి. 

గ్రహణం పడిన నక్షత్రంలో ఆరు నెలలు ముహూర్తాలు నిషేధిస్తారు. జన్మరాశి నుంచి 3,6,10,11 రాశులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాశులలో మధ్యమం, మిగిలిన రాశులలో అరిష్టం. 

ప్రస్తుత సూర్యగ్రహణం మూల నక్షత్రం, ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ నక్షత్ర కలిగిన వ్యక్తులు దానాలు, జపాలు చేయాలి.

సూర్య గ్రహణం గ్రహకూటమి వలన ఏర్పడే ఫలితాలు.అందరికీ ఆనందాన్ని కలిగించే ఆంగ్ల సంవత్సరము రాకకు ముందు

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్యగ్రహణం, ఆ సమయంలో  ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన అన్ని రాశుల వారిపై ప్రభావం మరియు ఆంగ్ల సంవత్సరంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు గురించి క్లుప్తంగా పరిశీలిద్దాం.

ధనురాశి ద్వంద్వ రాశి.

అగ్ని తత్వ రాశి. రాశి అధిపతి గురుడు ..అందులోనే శని కేతువు ల తో కలిసి ఉండడం.. ధను రాశి లోకి రవి సంక్రమణం వల్ల అస్తంగత్వం చెందడం, అదే సమయంలో గండాంత నక్షత్రం మీద సూర్యగ్రహణం ఏర్పడడం కొంత చికాకు ,ఆందోళన, ఒత్తిడి కలిగించే అంశం. జ్ఞానం వైపు అడుగులు సహజంగానే పడవు.

రవి మరియు శని ఒకే రాశిలో ఉండటం కూడా.. వ్యతిరేకమైన ఆలోచనలను రేకెత్తించే అవకాశం ఉంటుంది. మానసికమైన అహం తలెత్తే అవకాశం ఉంది.అమావాస్య రోజుల్లో చంద్రుని వలన బుద్ధి ప్రకాశవంతంగా ఉండక కల్లోలానికి గురవుతారు.

ద్వంద్వ రాశులలో గ్రహ సంచారం వలన,విద్య ఉద్యోగాలు అభివృద్ధి, చలనము మొదలగు మార్పులను గమనిస్తూ ఉంటాం.

అగ్ని తత్వ రాశి అయిన ధనురాశిలో ఈ

 షష్ట గ్రహ ప్రభావము మన మానసిక శక్తి పరీక్ష లాంటిది. కోరికలను  అదుపులో ఉంచుకుంటే ఈ పరీక్ష చక్కగా దాటగలం. అదే సంతులనం కోల్పోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఇబ్బందికి గురవుతారు. కేతువు బంధనాలను విడదీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనక క్షణికమైన ఆవేశాలను మనం గెలవాలి.

అప్పుడే బంధాలను బాధ్యతలను కాపాడుకోగలం. ఈ వచ్చే కాలాన్ని అంతర్ముఖంగా ఆత్మ శోధన చేసుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తులు తప్పకుండా సానుకూల ఫలితాలు పొందుతారు.

డిసెంబరు నెలలో పై గ్రహ ప్రభావం వలన సూర్య గ్రహ ప్రభావం వలన ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. 

ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ప్రతి వారికి జరుగుతున్న దశ అంతర్దశ నక్షత్ర ప్రభావమును బట్టి ఫలితాలు నిజానికి నిర్ణయం అవుతాయి. మన భావాలను సానుకూల దృక్పథంతో నడిపించడానికి ఈ గోచార ఫలితాలను పరిశీలించవలసి ఉంటుంది. కానీ వీటిపైనే పూర్తిగా ఆధారపడి ఉండకూడదు.

మేష రాశి వారికి :- అష్టమాధిపతి స్వ రాశిలో ఉండటం వలన సానుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి. మానసిక పరమైన ఆలోచనలో మార్పు గోచరిస్తుంది. జనవరి నుండి మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలుగులోకి తీసుకు వచ్చి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని అభివృద్ధి ప్రయాణం లాగా ఆనందంగా గడపండి.

వృషభ రాశి:-  వారి అష్టమ భావములలో ఏర్పడుతున్న గ్రహముల కూటమి ప్రభావం వలన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి కుజుడు తన రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల సహకారాన్ని అందిపుచ్చుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.

మిధున రాశి :-ఆవేశం  అదుపులో పెట్టుకుని మృదువైన మాట తీరుతో కాలం గడపండి. తొందరపడి బాంధవ్యాలను తెంచుకోకండి.

ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. త్వరలో మీరు స్థిరమైన బంధాలను ఏర్పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో మీ మాట బలం వలన మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి :- ఏ విధంగా ఆలోచనలు వెళ్తాయో ఫలితాలు కూడా అదే విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక సానుకూల దృక్పథంతో అన్ని అనుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. అదృష్ట కాలాన్ని అనవసరమైన అనుమానాలతో పాడు చేసుకోకండి. మానసికమైన ఆందోళనలు దరిచేరకుండా ధ్యాన మార్గం అవలంబించండి.

సింహరాశి:- ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగాలు మొదలగు విషయాలలో జాగ్రత్త వహించండి. జనవరి నుండి మీకు , మీ సంతానానికి తప్పకుండా లక్ష్యం సాధించడానికి 100% అవకాశం ఉంటుంది.. తాత్కాలికంగా ఇప్పుడు వచ్చే అనిశ్చితమైన పరిస్థితిని మనోధైర్యంతో నిబ్బరంగా ఎదుర్కోవడం మీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చుకుని విజయం సాధించడం మీ చేతుల్లోనే ఉంది.

కన్యా రాశి:- అర్ధాష్టమ శని తొలగిపోయే రోజులు. ఈ ఒత్తిడిని తట్టుకుని అనుకూలంగా మార్చుకోగలిగితే విజయం మీదే.

తులారాశి: ద్వితీయ అధిపతి కుజుడు అద్వితీయము లోనే ఉండటం వలన సుఖమైన కాలం. అభివృద్ధి దాయకం. శాంతి సౌఖ్యం. ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి .

వృశ్చిక రాశి:- రాజ్యాధిపతి కుజుడు సొంత రాశిలో ఉండటం వలన, ద్వితీయ అధిపతి గురుడు ద్వితీయంలో ఉండటం వలన రాబోయే సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది వీరి చేతుల్లోనే ఉంటుంది. అదృష్ట సమయం అని చెప్పాలి.

ధను రాశి:- అత్యంత ఒత్తిడికి , ఆందోళనకు, అనిశ్చిత త్వం ఈ రాశి వారి లో గమనిస్తాం.

వీరికి ఇది నిజంగా పరీక్షా కాలమే. జరుగుతున్న పరిణామాలను మనసుకు పట్టించుకోకుండా డా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మీరు తప్పకుండా వచ్చే సంవత్సరం నుండి ప్రశాంతంగా ఉంటారు.

మకర రాశి:- గుర్తింపులు పొంద లేరు , అత్యధిక వ్యయం. నిరాశ చెందకుండా జనవరి మాసం వరకు కాలం గడపడం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీ ఓర్పేమీకు శ్రీరామరక్ష.

కుంభరాశి:- ఈ రాశి వారికి అత్యంత అదృష్టం అయిన కాలం గా చెప్పుకోవచ్చును. 

 మీనరాశి :-

వారికి శుభ ఫలితాలు ఎక్కువ ఈ సంవత్సరం అంతా అత్యంత శుభదాయకం 

ఈ సంవత్సరం ఈ  సూర్య గ్రహణం వల్ల 12 రాశుల వారు సూర్యుడికి జపం చేయించుకోవాలి ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వలన 12 రాశుల వారు చేయించడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది.

సూర్యుడికి రాహుకేతువుల కి జప తర్పణ హోమాలు దానాలు చేయడం చాలా మంచిది వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించడం మంచిది 

గ్రహణ సమయా

॥ నవగ్రహపీడాహరస్తోత్రమ్ ॥

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః ౨॥

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।

వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥

ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।

సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః౪॥

దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।

అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥

దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।

ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ౬॥

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।

మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ ౭॥

మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః ।

అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ ౮॥

అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।

ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥ ౯॥

॥ ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

సర్వేజన సుఖినోభవంతు….

About The Author