గవర్నర్ను కలిసిన ఆల్ మైనారిటీ అసోసియేషన్ నెట్వర్క్ బృందం.


ఆల్ మైనార్టీ అసోసియేషన్ నెట్వర్క్ అధ్యక్షులు షేక్ అహ్మద్ అధ్యక్షతన ఈరోజు అన్ని మైనారిటీ సంఘాలను మరియు కార్మిక సంఘాలను కలుపుకొని రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి CAA NPR NRC ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరగకుండా చూడాలని కోరడం జరిగింది.
ఇది ఒక్క ముస్లింల సమస్య కాదని 130 కోట్ల మంది సమస్యఅని గమనించాల్సిన అవసరం ఉంది అని సీనియర్ మైనార్టీ నాయకులు మరియు అమన్ సభ్యులు Fathullah పేర్కొన్నారు.
నోట్ల రద్దు ద్వారా ఏ రకంగా అయితే దేశ ప్రజలను బ్యాంకుల ముందు బారులు కట్టి నుంచో పెట్టడం జరిగిందో అదేవిధంగా దేశంలో మీయొక్క పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆఫీసుల చుట్టూ ప్రదర్శనలు చేయించడానికి సిద్దపడుతోందని అమన్ ప్రధాన కార్యదర్శి ఫారూఖ్ షిబ్లీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇలాంటి నల్ల చట్టాలు అమలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని మరియు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని షిబ్లీ గవర్నర్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. కలిసిన వారిలో అమన్ ఉపాధ్యక్షులు హాబీబ్ రెహ్మాన్, కార్యదర్శి మౌలానా హుస్సేన్, డిస్పోజల్ మార్కెట్ ముజాహిద్, టైర్ మార్కెట్ ఇక్బాల్, రిజ్వాన్ మౌలానా నసీర్ అహ్మద్ పాల్గొన్నారు.

About The Author