వీరికన్నా ఊరపందులు నయం…


సంపాదించడమే కాదు, దాన్ని సద్వినియోగం చెయ్యడం కూడా తెలిసి ఉండాలి. తమిళ హీరో సూర్య కోట్లు సంపాదిస్తాడు. సంపాదించినదానితో రాష్ట్రం మొత్తం భూములు, సినిమాహాళ్లు కొనుగోలు చెయ్యకుండా, అగరం ఫౌండేషన్ అనే ఒక చారిటి ట్రస్ట్ ను స్థాపించి గత అయిదు సంవత్సరాలుగా కటిక పేదపిల్లలకు విద్యాదానం చేస్తున్నాడు. ఈరోజే ఒక తంజావూర్ కు చెందిన యువతి ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకుని కాంపస్ ప్లేస్మెంట్ సాధించి ఆ విషయాన్ని సభాముఖంగా చెప్పినపుడు సూర్య భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లతో ఆ యువతిని హత్తుకున్నాడు!
.
మన హీరోలూ ఉన్నారు…పనికిమాలిన చెత్త బిరుదులను తగిలించుకుని ఎంగిలి చేత్తో కాకిని విదిల్చని భ్రష్టులు. పన్నులు ఎగ్గొడుతూ, దేశం నిండా స్థలాలు, పొలాలు, సినిమా హాళ్లు, గెస్ట్ హౌసులు కొనుక్కుంటూ వేలకోట్ల సంపాదన వెనకేసుకునే నిష్టదరిద్రులు. వీళ్ళ బ్రతుకులూ ఒక బ్రతుకులేనా? విపరీతమైన ఆత్మవంచన, పైకి పొత్తులు లోపల కత్తులు అనే నికృష్టులు. జాలి, దయ, సెంటిమెంట్ లాంటి ఎలాంటి భావాలూ లేని రాతిగుండెలు.
.
మనదీ ఒక బ్రతుకేనా
కుక్కలవలె, నక్కలవలె
మనదీ ఒక బ్రతుకేనా
సందులలో పందులవలె
.
అని మహాకవి శ్రీశ్రీ నిరసన వ్యక్తం చేసినట్లు!

About The Author