హై పవర్ కమిటి తొలి సమావేశం… పరిపాలనా వికేంద్రీకరణే అభివృద్దికి సోపానం…!!
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని హైపవర్ కమిటీ భావించింది. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పరిపాలనా వికేంద్రీకరణ కూడా అవసరమని కమిటి ప్రాధమిక అంచనాకు వచ్చింది. మరోసారి సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని హైపవర్ కమిటీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం విజయవాడ ఏపియస్ఆర్టిసి సమావేశ మందిరంలో హైపవర్ కమిటి తొలి సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఏవిధంగా జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎలా ఉండాలి అనే విషయం పై జీయన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక , బిసిజి నివేదిక పై సుదీర్ఘంగా చర్చించారు.
జోనల్ , సెక్టర్ ల వారీ గా ఏవిధంగా అభివృద్ధి జరగాలి , అభివృద్ధి వికేంద్రీకరణ ,రాజధాని వికేంద్రీకరణ అనే అంశాలను సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించారు .
హైపవర్ కమిటీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ , మంత్రులు బొత్స సత్యనారాయణ , మేకతోటి సుచరిత , పేర్ని వెంకట్రామయ్య , మేకపాటి గౌతం రెడ్డి , కొడాలి వెంకటేశ్వరరావు , ఆదిమూలపు సురేష్ లతోపాటు పలువురు హైపవర్ కమిటి ఉన్నతాధి కారులు , జియన్ రావు కమిటి , బిసిజి కమిటీ సభ్యులు హాజరయ్యారు.
#APCapital #Amaravati #HypowerCommitte #Buggana #APFinanceMinister #YSRCP #YSJagan #GovtOfAP