జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, న్యూ ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వం సింథటిక్ గ్లాస్ కోటెడ్ థ్రెడ్ వాడకంపై నిషేదo…


జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, న్యూ ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వం సింథటిక్ గ్లాస్ కోటెడ్ థ్రెడ్ వాడకంపై విధించిన పూర్తి నిషేధాన్ని అమలు చేయడానికి, ఈ పండగ సీజన్ లో అటవీ శాఖ ఆరు మొబైల్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది.
మొబైల్ స్క్వాడ్లు దాదాపు 250 షాపులు, మాంజా అమ్మకం దారులపై తనిఖీలు చేసి 118 కిలోల నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నాయి.
అటవీ శాఖ నిఘా పెట్టడంతో ఎక్కడ కూడా సింథటిక్ మంజా బహిరంగ మార్కెట్లలో కనిపించకుండా అమ్మకం దారులు జాగ్రత్తపడ్డారు. రహస్యంగా స్టాక్ చేసి, కోరిన వినియోగదారులకు మాత్రమే సరఫరా చేసేలా చూశారు. నిఘా పెట్టిన అటవీశాఖ వాటిని కూడా స్వాధీనం చేసుకుంది.
గత సంవత్సరాలతో పోలిస్తే, నిషేధిత పదార్థం అమ్మకం, స్టాక్ పెట్టడం గణనీయంగా తగ్గింది. సింథటిక్ మాంజా దుష్పరిణామాలపై అమ్మకందారులతో పాటు కొనుగోలుదారులలో మరింత అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ముందస్తుగా చేసిన ప్రచారం సత్ఫలితాలు ఇచ్చిందని పీసీసీఎఫ్ ఆర్. శోభ వెల్లడించారు. జంతువులు, పక్షులు, మనుషులు, పర్యావరణంపై ఈ నిషేధించబడిన మాంజా వల్ల కలిగే హాని గురించి అవగాహన కల్పించడానికి ఎన్జీఓలు మరియు వాలంటీర్ల సహాయంతో అటవీ శాఖ దుకాణాలలో పోస్టర్లను ప్రదర్శించేలా చేసింది. ఆడియో, వీడియో రూపంలో ప్రచారం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అటవీ శాఖతో పాటు, పోలీసు టాస్క్‌ఫోర్స్, జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా సింథటిక్ మాంజా నిషేధ ఉత్తర్వులను అమలు చేశారు. కైట్స్ ఫెస్టివల్స్ సంస్థలు నిర్వహించే పోటీల సమయంలోనూ నిషేధిత మాంజాను ఉపయోగించ కూడదని నిర్వాహకులకు ముందస్తు సమాచారం అటవీశాఖ ఇచ్చింది. మొత్తంమీద సింథటిక్ మాంజా వాడకానికి వ్యతిరేకంగా సాధారణ ప్రజలలో కూడా అవగాహన పెరగటంతో ఈసారి సంక్రాంతికి మాంజా వాడకం తగ్గిందని అధికారులు తెలిపారు.

About The Author