పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఆదివారం నాడు ముఖ్యమంత్రి వర్యులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
#భారతదేశాన్ని #పోలియో #రహిత #దేశంగా #తీర్చిదిద్దాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి అంజాద్ బాషా పేర్కొన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఆదివారం నకాష్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఉప ముఖ్యమంత్రి వర్యులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్బాష మాట్లాడుతూ తల్లిదండ్రులు ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు. గతంలో ఏడాదికి రెండు సార్లు ప్రభుత్వం పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించే దన్నారు.2003 సంవత్సరం నుంచి మన జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో పోలియో కేసులు ఉన్నాయని, మన దేశాన్ని శాశ్విత పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏడాది పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 3054 పోలియో బూతులు, 74 మొబైల్ టీములు ఏర్పాటు చేసి ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.19వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 – 00 వరకు పోలియో బూతుల ద్వారా చిన్నారులకు చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.20, 21 తేదీలలో పోలియో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. కావున తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలనన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఉమాసుందరి, మున్సిపల్ కమిషనర్ లవన్న, డాక్టర్ మధు, డాక్టర్ జబిఉల్లా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.