మస్జిద్ ప్రాంగణంలోనే పూర్తి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి…


ఆ అమ్మాయి పేరు అంజూ. కేరళలోని చేరావలి మస్జిద్ పక్కనే నివసించే నిరుపేద హిందూ కుటుంబం. తండ్రి చనిపోయాడు. ఆమె పెళ్లి చేయడానికి తల్లికి తగిన ఆర్థిక స్థోమత లేదు. ఏంచేయాలో తోచక సమీపంలో ఉన్న మస్జిద్ కమిటీ వారికి తమ బాధ చెప్పుకున్నారు. కమిటీవారు చర్చించి అంజూ పెళ్లి బాధ్యత తామే తీసుకున్నారు. 10 సవర్ల బంగారు నగలతో పాటూ, 2 లక్షల రూపాయలు నగదు కూడా ఇచ్చారు.

మస్జిద్ ప్రాంగణంలోనే పూర్తి హిందూ సాంప్రదాయం ప్రకారం పురోహితులను పిలిచి అంజూ, అశోక్ లకు పెళ్లి జరిపించారు. 1000 మంది అతిథులకు శాకాహార విందు ఏర్పాటు చేశారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దృశ్యం చూపరులకు కనువిందు కలిగించింది.
This is My INDIA.

About The Author