JNU లో దొంగలు పడ్డారు !


JNU లో మొత్తం 301 మంది విదేశీ విద్యార్ధులు ఉంటే వాళ్ళలో 82 మంది యే దేశస్థులో తెలీదుట ! రాజస్థాన్ లోని కోట కి చెందిన యాక్టివిస్ట్ సుజిత్ స్వామి RTI యాక్ట్ ని ఉపయోగించి JNU లో ఎంతమంది విధ్యార్ధులు చదువుతున్నారు ? వాళ్ళ లో విదేశీ విద్యార్ధులు ఎంతమంది ? అంటూ వివరాలు కోరుతూ దరఖాస్తు చేశాడు.

దానికి సమాధానంగా JNU ఇచ్చిన సమాచారం ఇలా ఉంది. 1 st సెప్టెంబర్ 2019 వరకు జే‌ఎన్‌యూ లో చదువుతున్న విద్యార్ధుల వివరాలు ఇలా ఉన్నాయి. JNU లో మొత్తం విద్యార్ధుల సంఖ్య = 8805.వీరిలో 45% మంది M.Phil లేదా Phd డిగ్రీ చదువుతున్నారు. వీళ్లలో 82 మంది విదేశీ విద్యార్ధుల జాతీయత తెలియదు. కానీ వీళ్ళు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ,M.Phil, Phd కోర్సులలో చదువుతున్నారుట. తమాషాగా ఉంది కదా ?

కొరియా నుండి 35, నేపాల్ నుండి 25, china నుండి 24 , ఆఫ్ఘనిస్తాన్ నుండి 21, జపాన్ నుండి 16 , జెర్మనీ నుండి 13, అమెరికా నుండి 10 మంది విద్యార్ధులు JNU లో చదువుతున్నారట.
దేశ రాజధానిలో నడి బొడ్డున ఉన్న JNU లో 82 మంది విదేశీ విద్యార్ధులు ఏ దేశం వారో తెలియదట కానీ వీళ్ళు డిగ్రీ మొదలుకొని M.Phil దాకా చదివేస్తున్నారు. MEA [Ministry of External Affairs ] విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం ఉన్న డిల్లీ లో 82 మంది విదేశీ విద్యార్ధుల నేషనాలిటీ తెలియకపోవడం ఏమిటీ ?

దేశాన్ని దేవుడు కాదు ప్రజలే కాపాడాలి !
విద్యార్ధుల జాతీయత తెలియకపోతే అడ్మిషన్ ఎలా ఇచ్చారు ? పోనీ పోలీస్ కంప్లయింట్ ఎందుకు ఇవ్వలేదు ?
Copy to Delhi పోలీస్ కమీషనర్ , Copy to Secratary , MEA కి కంప్లయింట్ చేయొచ్చు కదా ? ఏదో జరిగింది ! ఇంకా ఏదో జరుగుతున్నది.
జైహింద్ !-పొట్లూరి పార్థసారథి

About The Author