లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్

చిత్తూరుజిల్లా:పీలేరు లోని కె.వి పల్లి మండలం గిరిజన బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న బాలాజీ గుత్తేదారుడి నుంచి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కాడు.  పీలేరులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు ఖాదర్ వలి అనే కాంట్రాక్టరు పాలు, గుడ్లు, మాంసం, కూరగాయలు వంటివి సరఫరా చేసేవాడు. ఇతనికి గతయేడాది ఆగస్టు నుంచి డిశంబరు వరకు రూ.5,37,000ల బిల్లులు అందాల్సి ఉంది.    అయితే ఈ బిల్లుకు సంబంధించిన చెక్కులను ఇవ్వాలంటే తనకు రెండు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బాలాజీ డిమాండ్ చేశాడు. చెక్కులు ఇచ్చాక తాను కోరిన లంచం కోసం ప్రిన్సిపాల్ రెండుసార్లు కాంట్రాక్టర్ ఖాదర్ వలి ఇంటికి వెళ్లాడని, మరోసారి చెక్కుతో సహా కాంట్రాక్టర్ వెంట స్థానిక స్టేట్ బ్యాంకుకు కూడా వెళ్లడంతో లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాకూతరు పాస్ పుస్తకం త్యాలేదంటూ అక్కడినుంచి వచేశాడని, ఆతరువాత తమను ఆశ్రయించినట్లు ఎసిబి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. పథకం ప్రకారం  ఏసిబి బృందం మంగళవారం ప్రిన్సిపాల్ ను అరెస్టు చేసినట్లు ఆడిషినల్ ఎస్పీ తెలిపారు.

 

About The Author