వనపర్తి మార్కెట్ యార్డ్‌లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం…
సాగునీటి తో పెరిగిన దిగుబడి
దేశంలోనే వేరుశనగకు జిల్లా పెట్టిందిపేరు
పాలమూరు-రంగారెడ్డితో మారనున్న రూపురేఖలు
వనపర్తి మార్కెట్ యార్డును టాప్‌లో ఉంచేలా కృషి
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
మార్కెట్ యార్డ్‌లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంటల ది గుబడి అనూహ్యంగా పెరిగిందని వ్యవసాయశాఖ మంతి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అ న్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వేరుశనగకు దేశంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కందులను క్వింటాకు రూ.5800 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని 46 వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు పరిమితి విధించిందని, పంట దిగుబడి, రైతుల నిరసనను దృష్టిలో ఉంచుకొని 50 వేల మెట్రిక్ ట న్నుల కందుల కొనుగోలుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. అనుమతి వచ్చే వరకు జాప్యం లేకుండా మార్క్‌ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు ప్రారంభించామన్నారు. ఆయా మార్కెట్‌యార్డులలో లేదా కేంద్రాలకు కేవలం మన రాష్ట్రంలోని రైతులు పండించిన కందులు మాత్రమే తీసుకోవాలని, ఇతర రాష్ర్టాల నుంచి వ చ్చే కందులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ విషయంలో మన రైతులు కూడా ఇతర ప్రాంతాల రైతులకు సహకరించొద్దని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు మిగతా ప్రాజెక్టులను పూర్తిచేసుకుంటే జిల్లాల రూపురేఖలు మారిపోతాయన్నారు. మరికొద్ది కాలంలోనే ఈ మార్పు జరగనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అత్యున్నత మార్కెట్ యార్డులలోకెళ్లా మన జిల్లా మార్కెట్ యార్డును 3, 4 స్థానాల్లో ఉండేలా రూపొందించుకుందామన్నారు. రాష్ర్టాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా బలం ఎంతో అవసరమన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు మరోసారి ప్రజాబలం ఉందని నిరూపించారని, మున్సిపల్ ఎన్నికలే ఇందుకు నిదర్శమని తెలిపారు.