ధైర్యానికి , సాహసానికి మారుపేరైన అజిత్ దోవల్ గారి గురించి మీకు తెలుసా…..?


ధైర్యానికి , సాహసానికి మారుపేరైన అజిత్ దోవల్ గారి గురించి మీకు తెలుసా…..?
ఆయన దేశభక్తి , సాహసాల గురించి ఒక్కసారి చదవండి.

అజిత్ దోవల్……….. ఈ పేరు వినబడితే పాకిస్థాన్ కు వణుకు పుడుతుంది. ఇండియన్ జేమ్స్ బాండ్ గా అజిత్ దోవల్ చేసిన సాహసాలు ఎన్నో…..ఎన్నెన్నో…..

భారత గూఢచారిగా పాక్ లో ఏకంగా ఏడు సంవత్సరాల పాటు……
అదీ ఓ భిక్షగాడి రూపంలో తిరిగాడంటే…. ఎవరైనా నమ్మగలరా?
కానీ అజిత్ దోవల్ ఆ సాహసం చేశారు.

1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు
హైజాకర్లతో మాట్లాడింది దోవలే.
శతృ దేశాలకు ఊహకు అందని ,మతిభ్రమించే వ్యూహాలు ఆయన సొంతం.

సిక్కుల స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ ను విజయవంతం చేయడంలో దోవల్ వేసిన స్కెచ్ సామాన్యమైనది కాదు.

కరుడుగట్టిన ఉగ్రవాదులు చుట్టుముట్టిన స్వర్ణ దేవాలయంలోకి ఒక రిక్షావాలాగా ప్రవేశించాడంటే…….. ఆయన దైర్యం ఏపాటితో అర్ధం చేసుకోవచ్చు.

2014లో ఇరాక్ తిక్రిత్‌లో ఉగ్రవాదులు అపహరించుకుపోయిన 46 మంది
భారత నర్సులను సురక్షితంగా విడిపించడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు.

ఉత్తరాఖండ్‌లో 1945లో పుట్టిన దోవల్ అజ్మీర్ మిలటరీ స్కూల్‌లో చదివారు. ఆయన తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.

ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో ఎంఏ చేసిన అజిత్ కుమార్ దోవల్ 1968లో కేరళ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. 1990 నుంచి 1996 వరకూ దోవల్ ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్‌లో పనిచేశారు.

1996లో లండన్‌లోని భారత హై కమిషన్‌లో కూడా పనిచేశారు.
ఇంటలిజెన్స్ బ్యూరో డైరక్టర్‌గా 2005లో రిటైరయ్యారు. 2009 నుంచీ
వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు ఫౌండర్ అండ్ డైరక్టర్‌గా ఉన్నారు.

2014 మే 30న మోదీ ప్రభుత్వం అజిత్ దోవల్‌ను భారత జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది. దీంతో పాక్ మీడియా సైతం దోవల్ గురించి ఆవులిస్తే పేగులు లెక్కపెడతాడు………జాగ్రత్త అంటూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

దోవల్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ అయిన దావూద్‌ ఇబ్రహీం పాక్‌ నుంచి ఆఫ్ఘన్‌కు మకాం మార్చాడు.

దోవల్‌ సైనికులకు మాత్రమే దక్కే కీర్తిచక్ర అవార్డు పొందిన తొలి ఐపీఎస్‌ అధికారి.

‘‘నాకు దేశమే ముఖ్యం………. దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం …….. శత్రువుల ప్రాణాలు తీయడానికైనా సిద్ధం “ అని ఉద్ఘాటించే
అజిత్ దోవల్ గారి గురించి అందరికీ తెలియజేయండి.

About The Author