కరోనా వైరస్ ను గుర్తించిన డాక్టర్ మృతి
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని తొలుత గుర్తించిన చైనా వైద్యుడు గురువారం మృతిచెందారు. ఫిబ్రవరి 1న ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరిన లీ వెన్‌లియాంగ్ గురువారం ఉదయం మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మృతిపట్ల చైనా ప్రజలు,ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం లీ మృతి పట్ల సంతాపం ప్రకటిం చింది.
నేత్రవైద్యుడైన లీ వెన్‌లియాంగ్ తనకు వద్దకు వచ్చిన ఓ రోగిలో డిసెంబరు 30న తొలిసారి కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. సార్స్ తరహా వైరస్ ఆనవాళ్లు గుర్తించా నంటూ తన మిత్రులకు సామా జిక మాధ్యమాల ద్వారా తెలిపాడు. సందేశం కాస్త వైరల్ కావడంతో విషయం వెలుగు లోకి రావడంతో అసత్య ప్రచార మని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని కింద అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారించిన రెండు వారాల తర్వాత అతన్ని వదిలి పెట్టా రు. జనవరి రెండో వారం లో ఆయనకి కరోనా వైరస్ సోకి నట్లు గుర్తించి ఫిబ్రవరి 1న ఐసీయూలో చేరి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మొదట కరోనా వైరస్ గుర్తించి ప్రజలను కాపాడటం కోసం పని చేసి అదే వైరస్తో మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.