ఎస్సై అమ్మాయిమీద కన్నేశాడు … కానిస్టేబుల్ అమ్మాయి అమ్మకు లైన్ వేసాడు..


న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చిన తల్లి, కుమార్తెల పై కన్నేసి వేధించిన గుంటూరుఅరండల్‌పేట ఎస్సై ,కానిస్టేబుల్ ను అర్బన్ ఎస్పీ సస్పెండ్ చేశారు. డీఎస్పీ, సీఐలకు ఛార్జి మెమోలు జారీ చేస్తూ గురువారం ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్‌, అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణలు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రేమికుడు మోసగించడంతో తనకు న్యాయం చేయాలంటూ యువతి తన తల్లిని తీసుకొని అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో స్టేషన్‌ ఎస్సై బాలకృష్ణ ఆ యువతికి మాయమాటలు చెప్పి తాను న్యాయం చేస్తానంటూ నమ్మించాడు. ఫోన్ నంబర్ తీసుకొని చాటింగ్ మొదలుపెట్టాడు. గత నెల 31న ఆ యువతి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. అదే పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రాము ఆ యువతి తల్లి పట్ల అసభ్యంగా మాట్లాడుతూ అనుచితంగా ప్రవర్తించారని వాపోయింది.లాడ్జికి పోదామంటూ వత్తిడిచేయడం మొదలుపెట్టాడు.
పోలీసు వేధింపులు ఎక్కువకావడంతో తల్లీకూతుళ్ళిద్దరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని తూర్పు డీఎస్పీ కె.సుప్రజను అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ ఆదేశించారు.
యువతిని ,ఆమె తల్లిని దారుణంగా వేధించిన విషయం విచారణలో వెల్లడికావడంతో ఎస్సైని ,కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి , కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ, సీఐలకు ఛార్జి మెమోలు జారీ చేశారు..

About The Author