మన సముద్ర తీరం మరింత భద్రం


భారత తీరప్రాంత నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచడానికి ప్రధాని నరేంద్రమోదీ గార ప్రభుత్వం చర్యలు చెప్పట్టింది. ఇందులో భాగంగా తీరప్రాంతంలో మరో 38 రాడార్ స్టేషన్లు, 5 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లతో తీరప్రాంత నిఘా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది. భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రాల తీర ప్రాంతాలతో కలపి మొత్తం 7,520 కిలోమీటర్ల పొడవైన తీరం ఉంది. నవంబర్ 26, 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడి తరువాత భారత జలాల్లో ప్రయాణిస్తున్న ఓడలు, మత్స్యకారులు బోట్ల కదలికలను తెలుసుకోవడానికి రక్షణ సంస్థ 2015లో మొదటి దశలో 46 రాడార్ స్టేషన్లు, తీరప్రాంతంలో 16 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను టర్న్కీ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది.

▪ఇప్పుడు తాజాగా…▪
గత వారం లక్నోలోని డిఫెక్స్‌పో (2020) రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండవ దశ కింద ఏర్పాటు చేయబోయే నిఘా వ్యవస్థ పరిదిలో పశ్చిమాన లక్షద్వీప్, తూర్పున అండమాన్ నికోబార్ దీవులు కూడా చెరనున్నాయి.

సమాచార ఆధారం : భారత రక్షణ పరిశోధన విభాగం

About The Author