గవర్నర్‌ ను కలిసిన టీడీపీ నేతలు…


విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై తెదేపా ప్రతినిధుల బృందం శనివారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. గవర్నర్‌ను కలిసిన అనంతరం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ…విశాఖపై జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘‘గతంలో విజయమ్మను ఎంపీగా ఓడించారని జగన్‌కు కక్ష. చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులే అడ్డుకోవడమేంటి?. ప్రశాంతంగా ఉన్న విశాఖలో అలజడి రేపుతున్నారు. పులివెందుల రాజకీయాలను విశాఖలో తీసుకొస్తున్నారు. పోలీసుల నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్నికాపాడాలి’’ అని కోరారు.
సీనియర్‌ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. తమ ఫిర్యాదుపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. విశాఖలో మొన్నటి ఘటన చూసి దేశమంతా నవ్వుకుందన్నారు. డీజీపీ‌, సీఎం జగన్‌ ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జడ్‌ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబును రౌడీషీటర్లు అడ్డుకోవడమేంటని నిలదీశారు

About The Author