సమాజాన్ని మార్చే సత్తా ఒక మహిళకు మాత్రమే ఉంది…వనపర్తి జిల్లా కలెక్టర్.


వనపర్తి జిల్లా
సమాజాన్ని మార్చే సత్తా ఒక మహిళకు మాత్రమే ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తరుని ఫంక్షన్ హాల్ లో తెలంగాణ మహిళా ఉపాధ్యాయుల సమాఖ్య వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు లేకుండా సమాజం లేదని, సృష్టి లేదని అన్నారు. సమాజంలో స్త్రీ, పురుషులిద్దరూ సమానమేనని, మహిళలు తాము తక్కువ అనే భావనను దూరం చేసుకోవాలని, నేనే గొప్ప అనే భావన కలిగినప్పుడు ఖచ్చితంగా విజయం సాధించవచ్చని అన్నారు. ప్రస్తుతం మహిళలు ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా ఎదిగినప్పటికీ ఇంకా అనేక అంశాలలో సాధికారత సాధించాల్సింది ఉందని అన్నారు. మహిళ తీసుకున్న నిర్ణయాలకు సమాజం చేయూతనిచ్చినప్పుడు నిజమైన సాధికారత సాధించినట్లు అని అన్నారు. చదువు ద్వారా ఏది మంచో ఏది చెడు తేలుస్తుందని ,అందువల్ల ప్రతి మహిళ చదువుపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం మహిళలకు ప్రాముఖ్యతనిస్తూ మహిళా దినోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నప్పటికీ మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి అంశాలపై చర్చించడంతో పాటు కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు మహిళలు తమపై జరుగుతున్న సంఘటనలను సమాజం దృష్టికి తీసుకు రావడం లేదని, మహిళలకు అన్యాయం జరిగినప్పుడు నిలదీయాలని అప్పుడే న్యాయం జరుగుతుందని అన్నారు .మహిళల పట్ల వివక్షత పెరిగిపోతున్నదని ఇందుకు ఉదాహరణ స్త్రీ పురుష నిష్పత్తిలో తేడా లేనని అన్నారు .మహిళలు ప్రతి విషయంలో మార్పు తీసుకు వస్తాను అన్న నమ్మకంతో పనిచేయాలని , అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పి హెచ్ డి లు అవసరం లేదని ,నిజాన్ని తెలుసుకొని బాధ్యతతో పని చేస్తే చాలు అని అని అన్నారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహిళల హక్కులకు రక్షణకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు .అంతేకాక కరోనా వైరస్ పై అవగాహనకు రూపొందించిన కరపత్రాన్ని వృద్ధులకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు జిల్లా కలెక్టర్ ను శాలువా పూలమాలలతో సత్కరించారు. అంతేకాక పలువురు మహిళ డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, టీచర్లను సన్మానించారు

About The Author