మందుబాబులకు షాక్.. దుకాణాలు బంద్..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇవ్వబోతుందని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 29 వరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గ్రామీణ స్థాయిలో మద్యం ప్రభావం ఓటర్లపై పడకుండా అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వరుసగా 15 రోజుల వరకు మద్యం దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితే వస్తే.. ఆదాయం తగ్గుతుందనే అబిప్రాయం కూడా ముఖ్యమంత్రిలో వ్యక్తమౌతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలను మూసివేయకుండా. తాత్కాలికంగా అమ్మకాలపై మరిన్ని ఆంక్షలను విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ముగిసేంత వరకూ మద్యం దుకాణాల సమయాన్ని కుదించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు అమ్మకాలు జరుపుతాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు సాయంత్రం 6 లేదా 7 గంటల వరకే మద్యాన్ని విక్రయించడానికి అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది.

About The Author