కాల్ చేస్తే కరోనా దగ్గు వినిపిస్తుందా.. ఇలా ఆపేయండి.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. ఇప్పుడు మీ చెవుల్లో వినిపిస్తోందా.. ఎవరికి ఫోన్ చేసినా వాళ్ల గొంతు కంటే ముందు కరోనా దగ్గే వినపడుతుంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన పెంచాలని ప్రభుత్వం ఇలా చేస్తుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల ప్రకారం.. ఫోన్ చేస్తే ముందుగా.. దగ్గు శబ్దం.. ఆ తర్వాత దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవడం, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ఈ ఆడియో దాదాపు 30 సెకన్ల పాటు వస్తుంది.
ఏ నెట్‌వర్క్‌ను మినహాయించుకుండా అందరూ ఫాలో అవ్వాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది.గతంలో ఎన్నడూ లేని విధంగా అందరికీ ఒకే కాలర్ ట్యూన్ వస్తుంది. కాలర్ ట్యూన్ మాట అటుంచితే ట్రింగ్.. ట్రింగ్ టోన్ కూడా వినిపించకుండా.. కరోనా దగ్గే వినిపిస్తుంది. అవగాహన వరకూ ఓకే కానీ, ఫోన్లు ఎక్కువ చేయాల్సిన పని ఉన్నవారు ఒక టెక్నిక్‌తో బయటపడొచ్చు.కరోనా సందేశం వినిపించకుండా …ఉండాలంటే నెంబర్ డయల్ చేసి కరోనా మెసేజ్ వస్తున్నప్పుడు 1నెంబర్ నొక్కాలి. దీంతో దగ్గులు, తుమ్ములు స్కిప్ అయి అవతల వ్యక్తి పెట్టుకున్న కాలర్ ట్యూన్ యే వినిపిస్తుంది.