విదేశాలనుంచి వస్తే 14 రోజులు ఇంటివద్దే ఉండాలి.. తెలంగాణ ప్రభుత్వం కరోనా అలర్ట్…


కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే వారు వ్యాధి లక్షణాలు లేకున్నా, 14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలని ఆదేశించింది. ఆ తర్వాత పరీక్షలు చేశాకే వారు బయటకు రావాల్సి ఉంటుంది. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్‌ సోకినా 14 రోజుల తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమానితుల చికిత్సలోనూ మార్పులు చేస్తున్నారు. విదేశాల నుంచి వ్యాధి లక్షణాలతో వచ్చిన వారిని, ఎలాంటి లక్షణాలు లేని వారిని వేర్వేరు చోట్ల ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు.

About The Author