కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవలి. వనపర్తి జిల్లా కలెక్టర్


కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా సామాన్యులకు మేలు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు,కౌన్సిలర్ లతో కోరారు.
బుధవారం కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పట్టణ మరియు పర్యావరణ అధ్యయన ప్రాంతీయ కేంద్రం హైద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో గద్వాల, వనపర్తి నాగర్ కర్నూల్ జిల్లాల మున్సిపల్ ప్రజాప్రతినిధులకు ఉద్దేశించి వనపర్తి సమీపంలోని నాగవరం వద్ద ఉన్న ప్రైవేట్ హోటల్లో ఏర్పాటుచేసిన సమీకృత శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మున్సిపల్ చట్టం ద్వారా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎన్నుకోబడ్డారని, కొత్త చట్టం సామాన్యులను దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగిందని, పట్టణాలలో ప్రజలు ప్రభుత్వం నుండి అనేక అంశాలలో మంచి జరగాలని ఆశిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా కొత్త చట్టంలో ప్రజాప్రతినిధుల పాత్ర, బాధ్యతలు, హక్కులు అనేకం ఉన్నాయని, వీటన్నింటిని తెలుసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్ లపై ఉందన్నారు. మున్సిపల్ అధికారుల సమన్వయంతో పని చేస్తే మున్సిపాలిటీలలో మంచి మార్పులు తీసుకురావచని, చట్టంలో పేద ప్రజలకు ఉద్దేశించి నిర్దేశించిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయవచ్చని తెలిపారు. ఆయా జిల్లాలలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు మోడల్ మున్సిపాలిటీలను ఎలా తీర్చిదిద్దాలో తెలుసుకోవాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలలో చేపట్టిన పనులపై ఇదివరకే మున్సిపల్ ప్రజాప్రతినిధులకు ఒక అవగాహన వచ్చినప్పటికీ, చట్టంలోని అన్ని విషయాలతో పాటు, మున్సిపాలిటీ కి వచ్చే నిధులు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చట్టప్రకారం తెలుసుకోవాలని చెప్పారు.గతంలో మాదిరి కాకుండా ప్రతి నెల మున్సిపాలిటీల కు నిధులు వస్తాయని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు ఫిబ్రవరి ,మార్చినెలలకు నిధులు విడుదల చేసిందని చెప్పారు .మున్సిపాలిటీ కి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలకు వచ్చే రాబడి ,బడ్జెట్, ఖర్చులు ,తప్పనిసరిగా చేయవలసిన చెల్లింపులు, అన్నింటిపై చట్టంలో తెలియజేయడం జరిగిందిని ,జాగ్రత్తగా వాటన్నిటిని తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో మున్సిపల్ పట్టణాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్ళ వచ్చని అన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలలో శానిటేషన్, హరితహారం, నర్సరీలు ,మొక్కల పెంపకం వంటి అంశాలలో ప్రజలను భాగస్వాములను చేయాలని, రాబోయే సంవత్సరాలలో పట్టణ పరిధిలో నాటి హరితహారం మొక్కలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అదేవిధంగా సమీకృత మార్కెట్లు, కమ్యూనిటీ టాయిలెట్లు ,పార్కుల నిర్మాణం, తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని, అలాగే మున్సిపల్ బడ్జెట్ నుండి ప్రతి నెల తప్పనిసరిగా చెల్లించే నిధులకు సంబంధించిన చార్జడ్ అకౌంట్ గురించి తెలుసుకోవాలని, ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు .
శిక్షణ కార్యక్రమానికి పట్టణ మరియు పర్యావరణ అధ్యయన ప్రాంతీయ కేంద్రం ప్రొఫెసర్లు పార్థసారథి, రవీంద్ర ప్రసాద్, రామారావు లు 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం అమలు తీరు, పట్టణ ప్రాంతంలో ఎదురయ్యే సమస్యలు, ప్రజాప్రతినిధుల పాత్ర, బాధ్యతలు, యాక్షన్ ప్లాన్, మోడల్ మున్సిపాలిటీ లు, టౌన్ ప్లానింగ్, టి ఎస్ బి పాస్, మాస్టర్ ప్లాన్, పట్టణాలలో మౌనిక వసతులు, తాగునీరు, శానిటేషన్, రెవెన్యూ, ప్రాపర్టీ టాక్స్, బడ్జెట్ కేటాయింపు, గ్రాంట్లు, తదితర విషయాలపై కూలంకషంగా శిక్షణ ఇచ్చారు .
ఈ శిక్షణ కార్యక్రమానికి కి మూడు జిల్లాల మున్సిపల్ కమిషనర్లు చైర్మన్లు వైస్ చైర్మన్ లు కౌన్సిలర్లు హాజరయ్యారు.

About The Author