తిరుపతి అరవింద్ అసుపత్రి ఎదురుగా ఉన్న అడవుల్లో 12 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
తిరుపతి:అలిపిరి నుంచి ఎస్వీ జూపార్క్ రోడ్డులో అరవింద ఐ ఆసుపత్రి ఎదురుగా ఒక కిలోమీటరు లోపల ఉన్న అడవుల్లో రవాణా చేస్తున్న 12 ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ పి రవిశంకర్ గారికి అందిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఆర్ ఎస్ ఐలు వాసు, లింగాధర్ డీఅర్ ఒ నరసింహారావు టీమ్ లు శేషాచలం అడవులలో చెట్ల మద్యకు చేరుకుని వారి రాక కోసం ఎదురు చూడసాగారు. సరిగ్గా ఆరు గంటల సమయం లో కొంతమంది స్మగ్లర్లు దుంగలను తీసుకొచ్చి వాన నీటి సేకరణ గుంతల్లో చేరవేస్తున్నారు. దీంతో వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా, స్మగ్లర్లు పారిపోయారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని వెంటాడి పట్టుకున్నారు. వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా పోలూరుకు చెందిన వెంకటేష్ (35), శ్రీనివాస్ (25)లుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుంచి 12 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి డీఎస్పీ వెంకటయ్య, ఎసిఎఫ్ కృష్ణయ్య, ఆర్ ఐ లు చెందు, మురళి చేరుకున్నారు. ఇంకా సిఐ సుబ్రమణ్యం అక్కడ కు చేసుకున్నారు.