పెట్రోల్, డీజిల్ పై రోడ్ సెస్, ఎక్సైజ్ డ్యూటీ భారం

న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ లీటరుపై రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీని, రోడ్ సెస్ కింద రూపాయి పెంచుతూ శనివారం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు రోడ్డు సెస్ కింద పెట్రోల్, డీజిల్ లీటరుకు రూపాయి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు తగ్గినా లాబాలు రాబట్టుకునేందుకే కేంద్రం ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుందని సమాచారం.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రభావం ఉండక పోవచ్చు. శనివారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 69.87 రూపాయలు, లీటరు డీజిల్ ధర 62.58 రూపాయలుంది. కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచినా, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గిన దృష్ట్యా ఇంధన ధరలపై ప్రభావం చూపించలేదు. సౌదీఅరేబియా, రష్యా దేశాల మధ్య ఇంధన ధరల యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పడిపోయాయి.

 

About The Author